SBI Education loan: విదేశీ విద్యకు ఎస్బీఐ స్పెషల్ ఎడ్యుకేషన్ లోన్.. పూర్తి వివరాలు
సాధారణంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు బ్యాంకు లోన్లు తీసుకుంటారు. కరోనా కారణంగా కొంత కాలం విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది.
ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అడ్మిషన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే విద్యా వ్యయాలు గణనీయంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో చాలా మంది విద్యా రుణాలపైనే ఆధారపడుతున్నారు. ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేని విద్యార్థుల కోసం దేశీయ అతిపెద్ద రుణదాత స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ ఎడ్-వాంటేజ్ (SBI Global Ed-Vantage) పేరుతో ఎడ్యుకేషన్ లోన్ ప్రారంభించింది. విదేశీ యూనివర్సిటీల్లో ఫుల్‌టైం రెగ్యులర్ కోర్సులు అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం దీన్ని రూపొందించింది. ఎస్బిఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్ ఎడ్యుకేషన్ లోన్ కింద వడ్డీ రేట్లు, ప్రయోజనాలు, ఫీచర్ల వివరాలను పరిశీలిద్దాం.
8.65 శాతం వడ్డీకే..
ఎస్బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్ లోన్ స్కీమ్ కింద విదేశాల్లో రెగ్యులర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ / డాక్టరేట్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు రుణాలు అందిస్తుంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూరోప్, జపాన్, సింగపూర్, హాంకాంగ్, న్యూజిలాండ్ దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఈ రుణాలను మంజూరు చేస్తుంది. రూ. 7.50 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు రుణాలు పొందవచ్చు. ఈ రుణాలకు 8.65 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇక, మహిళా దరఖాస్తుదారులకు ప్రత్యేకంగా 0.50% వడ్డీ రాయితీ లభిస్తుంది. కోర్సు పూర్తయిన 6 నెలల తర్వాత ఈఎంఐ చెల్లించడం ప్రారంభమవుతుంది. రుణాన్ని చెల్లించడానికి గరిష్టంగా 15 సంవత్సరాల సమయం ఉంటుంది.
ఎలాంటి ఖర్చులకు రుణం?
విమానం ప్రయాణ వ్యయం, ట్యూషన్ ఫీజు, పరీక్ష/లైబ్రరీ/ల్యాబ్ ఫీజు, పుస్తకాలు/యూనిఫాం/కంప్యూటర్ ఫీజులు, ప్రాజెక్ట్ వర్క్/థీసిస్/స్టడీ టూర్లకు అయ్యే ఖర్చుకు రుణాన్ని మంజూరు చేస్తారు.
స్కీమ్ ప్రయోజనాలు
వెబ్సైట్ ద్వారా సౌకర్యవంతమైన, వేగవంతమైన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఉంటుంది. వేగవంతమైన అప్రూవల్ ప్రాసెస్‌తో పాటు I-20/వీసా జారీ కాక ముందే మొత్తం రుణాన్ని విడుదల చేస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 (E) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. దీంతోపాటు ట్యూషన్ ఫీజును నేరుగా యూనివర్సిటీకే చెల్లిస్తుంది.
అవసరమయ్యే డాక్యుమెంట్లు
ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు 10 వ తరగతి, 12వ తరగతి మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్, ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అడ్మిషన్ ప్రూఫ్‌గా యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్/ఆఫర్ లెటర్/ఐడి కార్డ్ వంటివి, కోర్సుకు అయ్యే మొత్తం ఖర్చుల వివరాలు, స్కాలర్షిప్, ఫ్రీ-షిప్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను అందించాలి.
గ్యాప్ సర్టిఫికేట్ (స్టడీస్‌లో మధ్యలో గ్యాప్ ఉన్న వారికి మాత్రమే), విద్యార్థి / తల్లిదండ్రులు / గ్యారెంటర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (ప్రతి 1 కాపీ). కో అప్లికెంట్/గ్యారెంటర్ అసెట్ లయబెలిటీ స్టేట్మెంట్ (రూ. 7.50 లక్షలకు మించిన రుణాలకు వర్తిస్తుంది) సైతం అవసరం అవుతాయి. ఒకవేళ కో అప్లికెంట్ ఉద్యోగం చేస్తున్నట్లైతే అతని లేటెస్ట్ పే స్లిప్, ఫారం 16 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
వ్యాపారం చేసే వారి విషయంలో బిజినెస్ అడ్రస్ ప్రూఫ్, తాజా ఐటీ రిటర్న్స్, ఆరు నెలల బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్జజ విద్యార్థి / తల్లిదండ్రులు / గ్యారెంటర్ పాన్ కార్డు... విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డు కాపీ
పాస్‌పోర్ట్/ డ్రైవింగ్ లైసెన్స్/ ఓటరు ఐడీ కార్డ్.. వంటి అన్ని డాక్యుమెంట్లను బ్యాంకులకు అందించాలి.
0 Comments:
Post a Comment