Reservations: ప్రభుత్వ బడిలో చదివిన వారికి రిజర్వేషన్.. తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం..
తమిళనాడు ప్రభుత్వం(Tamilnadu Govt) సంచలన నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థులకు రిజర్వేషన్ కల్పిస్తున్న బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.
ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్, ఫిషరీస్, లా, వెటర్నరీ, ఇతర కోర్సులల్లో అండర్ గ్రాడ్యుయేట్(Under graduate) కోర్సుల్లో 7.5శాతం రిజర్వేషన్(Reservation) లభించనుంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షపార్టీ అన్నాడీఎంకే స్వాగతిస్తోంది.
జస్టిస్ మురుగేశన్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొంది. ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరుతున్న ప్రభుత్వ విద్యార్థులపై అధ్యయనం చేసి వారికి ఈ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో ఎన్నో పెద్ద ప్రొఫెషన్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ విద్యార్థులు(Studengs) తక్కువగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థులకు మంచి విద్యావకాశాలు కల్పించేలా రిజర్వేషన్ నిర్ణయం తీసుకొన్నట్టు ఎం.కె స్టాలిన్(M. K. Stalin) ప్రకటించారు.
దేశంలోనే ప్రొఫెషనల్ కోర్సులు.. ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. అతి పెద్ద ఐటీ కంపెనీలు అయిన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, కాగ్నిజంట్ సంస్థలు తమిళనాడు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. చెన్నై పారిశ్రామిక కారిడార్లో(Industrial corridor) హుండాయ్, బీఎండబ్ల్యూకు చెందిన తయారీ సంస్థలు ఉన్నాయి. తమిళనాడులో సాంకేతికి కార్మికుల అవసరం చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం నిజమైన పేదలకు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రొఫెషన్ కోర్సులు(Professional courses) చేసిన వారికి ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ నిర్ణయంతో ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువమందికి అవకాశం లభిస్తుంది. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇదో మంచి అవకాశం. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (EWS) ప్రభుత్వం నిర్ణయం కచ్చితంగా అండగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. గతంలో ఎడప్పాడి పళనిస్వామి ( Edapaddi K. Palaniswami) ప్రభుత్వం మెడికల్ కళాశాల్లో(Medical Colleges) ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఇదే శాతాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం నీట్(NEET) పరీక్షకు రాష్ట్రంలో నిర్వహించడంపై ప్రతిపక్ష పార్టీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తాజా నిర్ణయం ప్రభుత్వపాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమని మేధావులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment