Jobs in Andhra Pradesh: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. Amazon, HDFC Bankతో పాటు మరో రెండు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు.. వివరాలివే
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. భారీ జాబ్ మేళాలు నిర్వహించి వివిధ ప్రముఖ సంస్థల్లో స్థానిక యువకులకు వందల సంఖ్యలో ఉద్యోగవకాశాలను కల్పిస్తోంది ఏపీఎస్ఎస్డీసీ. తాజాగా మరో జాబ్ మేళాను ప్రకటించింది APSSDC. ఈ నెల 16న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. Hyundai Mobis, HDFC Bank, Wistron, Amazon తదితర సంస్థల్లో ఈ జాబ్ మేళా ద్వారా నియమకాలను చేపట్టనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు.
ఈ సంస్థలో 50 ఖాళీలను భర్తీకి నియామకాలు చేపట్టనున్నారు.
ప్రొడక్షన్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ/బీటెక్/డిప్లొమో(2019,2020,2021 Passed Outs) అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనం చెల్లించనున్నారు. వయస్సు 19-23 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు పెనుకొండలో పని చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ. 13,140 వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఈ బ్యాంకులో 50 ఖాళీలు ఉన్నాయి. బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 14 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు ఏపీలో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. మొబైల్ అసెంబ్లింగ్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఐటీఐ, డిప్లొమో చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు Kolar, Karnatakaలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-24 ఏళ్లు ఉండాలి. కేవలం స్త్రీలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని నోటిఫికేసన్లో స్పష్టం చేశారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 16న ఉదయం 10 గంటలకు శ్రీ సాయి డిగ్రీ కాలేజీ, బస్టాండ్ రోడ్, ధర్మవరం, అనంతపురం జిల్లా చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 8464949408, 8247027608 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
0 Comments:
Post a Comment