ఇతర సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులతో పాటు ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం తదితర జీర్ణక్రియ సమస్యలు తరచుగా ఇప్పుడే ఎదురవుతుంటాయి. తేమతో కూడిన వాతావరణం జీర్ణక్రియ రేటును నెమ్మదించేలా చేస్తే, కలుషితమైన ఆహారం మరిన్ని జీర్ణ సంబంధ సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ సీజన్లో శుద్ధి చేసిన నీరు, సమతులాహారం తీసుకోవాలంటారు వైద్యులు.
ఇతర సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులతో పాటు ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం తదితర జీర్ణక్రియ సమస్యలు తరచుగా ఇప్పుడే ఎదురవుతుంటాయి. తేమతో కూడిన వాతావరణం జీర్ణక్రియ రేటును నెమ్మదించేలా చేస్తే, కలుషితమైన ఆహారం మరిన్ని జీర్ణ సంబంధ సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ సీజన్లో శుద్ధి చేసిన నీరు, సమతులాహారం తీసుకోవాలంటారు వైద్యులు.
జీర్ణక్రియ సాఫీగా జరిగేలా! జీర్ణక్రియ సాఫీగా జరిగేలా! జీర్ణక్రియ సాఫీగా జరిగేలా! ఇంగువ, సోంపు గింజలు, ఆవాలు, ఉసిరి, పుదీనా...
ప్రతి వంటగదిలో కచ్చితంగా ఉండే ఈ పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలా వీటితో సులభంగా చేసుకునే వంటకాల్లో 'బాజ్రా - ఆమ్లా' చట్నీ కూడా ఒకటి. ఎసిడిటీ సమస్యలను తగ్గించే సజ్జలు, ఉసిరికాయలను ఉపయోగించి సులభంగా ఈ తొక్కును తయారుచేసుకోవచ్చు. బాజ్రా- ఆమ్లా చట్నీ బాజ్రా- ఆమ్లా చట్నీ బాజ్రా- ఆమ్లా చట్నీ కావాల్సిన పదార్థాలు కావాల్సిన పదార్థాలు కావాల్సిన పదార్థాలు * మొలకలు వచ్చిన సజ్జలు - అరకప్పు * ఉసిరి కాయలు - 4 * పటిక బెల్లం - పావు కప్పు * పచ్చి మిరపకాయలు - 3 * పసుపు - అర టీస్పూన్ * సోంపు గింజలు - అర టీస్పూన్ * ఆవాలు - అర టీస్పూన్ * మెంతులు - అర టీస్పూన్ * ఇంగువ - పావు కప్పు * ఆవాల నూనె - 2 టేబుల్ స్పూన్లు * పుదీనా తయారీ విధానం!
తయారీ విధానం! తయారీ విధానం! ప్రెషర్ కుక్కర్లో నూనె వేసి ఆవాలు, సోంపు గింజలు, మెంతులు, ఇంగువ, పచ్చి మిరపకాయలు వేయించాలి. ఇవి చిటపటలాడడం మొదలయ్యాక మొలకెత్తిన సజ్జలు వేసి నిమిషం పాటు ఉడికించాలి.
ఆ తర్వాత ఉసిరికాయ ముక్కలు, పసుపు, నీళ్లు జత చేసి గరిటె సహాయంతో బాగా కలపాలి. ఆపై పుదీనా ఆకులు వేసి మూత పెట్టాలి. 15 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత పటిక బెల్లం కూడా కలిపేసి కిందకు దించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి.
చివరగా పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన బాజ్రా- ఆమ్లా చట్నీ రడీ! బ్రెడ్, చపాతీలు, పరాఠాలు, వడలు, కబాబ్‌లు, రోల్స్, టోస్ట్‌లు, క్రాకర్స్‌తో దీనిని కలిపి తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు! ఆరోగ్య ప్రయోజనాలు!
ఆరోగ్య ప్రయోజనాలు!
* కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ చట్నీ ఉత్తమ ఆహారం.
* సజ్జలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, రక్తపోటు సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.
* 100 గ్రాముల సజ్జలలో 3 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది.
అందుకే రక్తహీనతతో బాధపడేవారు, గర్భిణులు వీటితో తయారుచేసిన పదార్థాలను తినాలని నిపుణులు సూచిస్తుంటారు.
* ప్రతిరోజు ఉదయాన్నే మొలకెత్తిన సజ్జలను పిల్లలకు తినిపించడం వల్ల ఎత్తు పెరుగుతారు.
* ఇక ఈ చట్నీలో ఉపయోగించే పసుపు, పుదీనా, మెంతులు, ఇంగువ, సోంపు గింజలు వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
0 Comments:
Post a Comment