Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 24 August 2021

Harihar fort / Harshagad fort - ప్రపంచంలోనే ప్రమాదకరమైన కోట ఎక్కడో కాదు మన దగ్గరే..

 Harihar fort / Harshagad is a fort located 40 km from Nashik City, 48 km from Igatpuri, 40 km from Ghoti in Nashik district, of Maharashtra. It is an important fort in Nashik district, and was constructed to look upon the trade route through Gonda Ghat. It receives many visitors because of its peculiar rock-cut steps.

మన దేశంలోని చారిత్రాత్మక కోటలు ఎన్నో ఉన్నాయి. ఈ కోటల కట్టడాలలో అప్పటి వారు చూపించిన అద్భుతమైన కళాత్మక నైపుణ్యం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
అయితే కొన్ని ఫోటోలు చూస్తే మాత్రం దడ పుట్టక మానదు. ఆ కోట చూడడమే కాదు అక్కడికి వెళ్లాలన్నా ఎంతో ప్రమాదకరం, అలాగే ఎగ్జైటింగ్ కూడా ఉంటుంది. అడుగడుగునా శ్వాసను ఆపేసే టెన్షన్ తో పాటు గమ్యాన్ని చేరుకోవాలనే కోరిక కూడా పెరుగుతుంటుంది. అయితే మనం మాట్లాడుకునే ఈ అత్యంత ప్రమాదకరమైన కూడా ఎక్కడో లేదు మన దేశంలోనే ఉంది. దాన్ని చేరుకోవాలంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దారి గుండా వెళ్లాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని నాసిక్, కాసర నుండి 60 కిలోమీటర్ల దూరంలో హర్ష గడ్ కోట ఉంది. 


దీనిని హరి హర్ కోట అని కూడా పిలుస్తారు. అత్యంత కష్టమైన హిమాలయాలను అధిరోహించే పర్వతారోహకులు కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ట్రిప్ గా చెప్తారు.

ఈ పర్వతం కిందనుంచి చూస్తే చతురస్రాకారంలో కనిపిస్తుంది. రెండు వైపులా 90 డిగ్రీల కోణంలో, మూడో వైపు 75 డిగ్రీల కోణంలో ఉంటుంది. కోట 170 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని అధిరోహించడానికి 117 మెట్లు కట్టారు. దాదాపు యాభై మెట్లెక్కగానే ప్రధాన ద్వారం వస్తుంది. ఇది ఇప్పటికీ ద్రుడంగా ఉంది. ఆ తర్వాత ఒక రాతి గుండా లోపలి వెళ్లాల్సి ఉంటుంది. అది కోట పై భాగానికి తీసుకెళుతుంది. అక్కడ హనుమాన్, శివుడు దేవాలయాలు ఉంటాయి. ఆ ప్రదేశంలో ఉండే చిన్న చెరువులో నీరు చాలా స్పష్టంగా ఉంటుంది. అవి మీరు తాగొచ్చు కూడా.



ఇంకా ముందుకెళ్తే రెండు చిన్న గదులు ఉన్న ప్యాలెస్ కనిపిస్తుంది. అందులో 10 నుంచి 12 మంది ఉండొచ్చు. ఇక్కడి నుంచి చూస్తే బాస్ గడ్ కోట, ఉదావత్ శిఖరం, బ్రహ్మ కొండల సుందరమైన దృశ్యం కనువిందు చేస్తుంది. ఈ పర్వతం దిగువన ఉన్న నిర్గుడ్ పాడ గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖేష్ త్రిమ్బకేశ్వర్ నుంచి 22 కిలోమీటర్లు, నాసిక్ నుంచి 45 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పర్వతాన్ని మొట్టమొదటిసారిగా 1986లో డవ్గ్ స్కాట్ అనే పర్వతారోహకుడు ట్రెక్కింగ్ చేశారు. అందుకే దీన్ని స్కాటిష్ కడా అని కూడా పిలుస్తారు. ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ఆయనకు రెండు రోజులు పట్టిందట. మొత్తానికి ఇక్కడికి వెళ్ళడం పెద్ద అడ్వెంచర్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ తో వెళితే అయితే ఇంకా సరదాగా ఉంటుంది. అడ్వెంచర్ ట్రిప్ ఇష్టపడేవారు కచ్చితంగా అక్కడికి వెళ్లి తీరాల్సిందే.

Videos....





0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top