Facilities provided .. Increase capabilities
- Director Vetriselvi
వసతులు కల్పించాం.. సామర్థ్యాలు పెంచండి
సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు వెట్రిసెల్వి
రంగుల గురించి వివరిస్తున్న సంచాలకులు వెట్రిసెల్వి
ఇబ్రహీంపట్నం గ్రామీ ణం, న్యూస్టుడే: ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన పాఠ్యపుస్తకాల ద్వారా సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి సూచించారు.
ఆమె శుక్రవారం రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు బి.ప్రతాప్ రెడ్డితో కలిసి మూలపాడు జడ్పీ ఉన్నత పాఠశాల, కాచవరం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థులను వివిధ అంశాలపై ప్రశ్నించారు. ప్రభుత్వం సరఫరా చేసిన డిక్షనరీలను విద్యార్థులకు అందజేశారు. ఆంగ్లం, తెలుగు, గణితాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జగనన్న విద్యా కిట్ల బయోమెట్రిక్ అథంటికేషన్లను పరిశీలించి వాటిని విద్యార్థులు ఎలా వినియోగిస్తున్నది పరిశీలించారు. పాఠశాలలో జరిగిన 'నాడు నేడు' అభివృద్ధి పనులను పరిశీలించి వాటి నిర్వహణ పట్ల పాఠశాల కమిటీలు శ్రద్ధ చూపాలని కమిటీ సభ్యులకు వివరించారు. వారి వెంట సమగ్ర శిక్ష జిల్లా అదనపు సమన్వయకర్త లక్ష్మీదుర్గ, సీఎంవో సతీష్, సీఆర్పీ నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు కె.ఎన్.జె.లక్ష్మి, నాగమల్లేశ్వరి, ఉపాధ్యాయులు ఇర్ఫాన్ పాఫా, శర్మలు ఉన్నారు.
0 Comments:
Post a Comment