Conducting Elections for Reconstitution of parents committees from september 16..2021
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా తల్లిదండ్రుల కమిటీలను parents committee 2021 2022 ఏర్పాటు చేయుటకు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ
16 09 2021 notification and display of voters list
20 09 2021 objections and finalisation of voters list
22 09 2021 Conduct election to Chairman and Vice chairman
Oath taking by the new committee
Conducting First meeting on the day
✍పాఠశాలల్లో హడావుడి
♦తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు పచ్చజెండా
♦22న పోలింగ్, అదే రోజు ఫలితాల ప్రకటన
పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ (పేరెంట్స్ కమిటీలు) ఎన్నికల నిర్వహణకు నగరా మోగింది. ప్రస్తుత కమిటీల పదవీకాలం అక్టోబరుతో ముగియనుండడంతో పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు సంబంధించిన హడావుడి ఇక ప్రారంభం కానుంది. తక్షణమే ఈ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఏ ఎన్నికలైనా రసవత్తరంగానే ఉంటాయి. రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019లో ప్రతి సర్కారీ పాఠశాలకు తల్లిదండ్రుల కమిటీలు ఉండాలని, వాటిని ఎన్నిక ద్వారానే నియామకం చేసుకోవాలని ఆదేశించింది. అనేక పాఠశాలల్లో గతంలో ఘర్షణలు చెలరేగడంతో ఈసారి ఓటర్ల జాబితా ప్రచురణ నుంచే పకడ్బందీగా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో హెచ్ఎంలు, ఎంఈఓలతో సమావేశాలు, టెలీకాన్ఫరెన్స్‌లు పెట్టి ఈ ఎన్నికలకు జారీ చేసిన మార్గదర్శకాలను వివరిస్తారు.
♦16న నోటిఫికేషన్
ఈనెల 16న ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఛైర్మన్, ఉపాధ్యక్షుడు, సభ్యుల ఎన్నికకు ఆ రోజున నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓటరు జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. దానిపై 20న అభ్యంతరాలు స్వీకరించి తుది ఓటర్ల జాబితాను నోటీసు బోర్డులో పెట్టేలా షెడ్యూల్‌ను ప్రకటించారు. 22న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు ఛైర్మన్, ఉపాధ్యక్షులను తల్లిదండ్రి కమిటీ సభ్యులు ఎన్నుకుంటారు. ఎన్నిక ముగిసిన అనంతరం 2 గంటలకు ఛైర్మన్, ఉపాధ్యక్షులతో ప్రమాణస్వీకారం, అనంతరం 3 గంటలకు కమిటీ తొలి సమావేశం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సమగ్రశిక్ష అధికారులను ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నాడు-నేడు రెండో విడత పనులు చేపట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పనులను తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఆ పనుల నిర్వహణకు కమిటీ పేరుతో బ్యాంకు ఖాతా తెరవాలి. నాడు-నేడు పనులకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసే ప్రతి పైసాను ఈ కమిటీ వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో వచ్చే నెలతో ముగియనున్న పాలకవర్గాల పదవీ కాలానికి ముందే ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీలతో పనులు నిర్వహించడానికి వీలుగా తాజాగా ప్రభుత్వం షెడ్యూల్ జారీ చేసిందనే అభిప్రాయం ఉపాధ్యాయవర్గాలు, పేరెంట్స్ కమిటీ సభ్యుల్లో వ్యక్తమవుతోంది.
0 Comments:
Post a Comment