ఇబ్రహీంపట్నం CFMS కార్యాలయంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక అంశాలన్నీ మీడియాకు లీక్ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం... ప్రభుత్వ ఉద్యోగులపై తన ప్రతాపాన్ని చూపుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక డేటాను మీడియాకు లీక్ చేశారని ఆర్థిక శాఖలోని ముగ్గురు అధికారులను ఇవాళ ఉదయం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఇబ్రహీంపట్నం CFMS కార్యాలయంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులను ఇదే కారణంతో సస్పెండ్ చేయడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది.
ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారం బయటకు ఇస్తున్నారన్నది ప్రభుత్వ అభియోగం. డేటా చాలా పక్కాగా మీడియాలో రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు, మంత్రులు స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, అప్పులు చేయక తప్పడం లేదని బహిరంగంగా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కరోజే 13 మందిపై చర్యలు తీసుకోవడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
0 Comments:
Post a Comment