Breaking: Curfew extended again in AP
బ్రేకింగ్ : ఏపీలో కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కర్ఫ్యూ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంటల సమయం నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగనున్న ట్లు సర్కార్ స్పష్టం చేసింది. ఇక పొడగించి కర్ఫ్యూ… ఈ నెల 21 వ తేదీ వరకు అమలు కానున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్. కర్ఫ్యూ పొడగించిన నేపథ్యంలో ప్రజలందరూ సహకరించాలని తెలిపింది. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది సర్కార్. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది.
కాగా..ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1535 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,89,296 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో 16 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,631 కి చేరింది
0 Comments:
Post a Comment