Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 16 August 2021

అఫ్గాన్‌లో తాలిబన్‌ రాజ్యం రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు తలవంచిన అష్రాఫ్‌ ఘనీ ప్రభుత్వం రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయిన అష్రాఫ్‌ ఘనీ

కాబూల్‌, ఆగస్టు 15: కర్కశ చట్టాలు, కఠిన నిబంధనల నుంచి విముక్తి పొంది.. గత రెండు దశాబ్దాలుగా స్వేచ్ఛా వాయువులు పీల్చిన అఫ్ఘానిస్థాన్‌ దేశస్థులు మళ్లీ స్వాతంత్య్రం కోల్పోయారు..! యావత్‌ దేశం దాదాపుగా తాలిబన్ల వశమైపోయింది. ఆదివారం ఉదయానికి దేశ రాజధాని నగరం కాబూల్‌ శివార్లలో ఉన్న తాలిబన్లు.. సాయంత్రానికి నగరంలోకి దూసుకుపోయారు. అయితే.. నగరంలో ఎలాంటి విధ్వంసాలకు పాల్పడబోమని, అది తమ ఉద్దేశం కానేకాదని తాలిబన్లు ప్రకటించారు. శాంతియుత మార్గంలో అధికార బదలాయింపు కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. అటు తాలిబన్‌ సేనలు కాబూల్‌ను చుట్టుముట్టిన సమాచారం అందగానే.. ఇంతకాలం ఖతార్‌ రాజధాని నగరం దోహా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న తాలిబన్ల పొలిటికల్‌ బ్యూరో అధినేత ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌, మరో నేత మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానెక్జాయ్‌, ఇతర నేతలు కాబూల్‌ చేరుకున్నారు.

వారికి అఫ్ఘానిస్థాన్‌ ప్రభుత్వ పెద్దలు కాబూల్‌ విమానాశ్రయంలో సాదరంగా ఆహ్వానం పలికారు. తాలిబన్లకు ఆహ్వానం పలికిన వారిలో అఫ్ఘాన్‌ పునర్నిర్మాణ మండలి చీఫ్‌ డాక్టర్‌ అబ్దుల్లా అబ్దుల్లా, మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, హిజ్బ్‌-ఎ-ఇస్లామి నేత గులాబుద్దీన్‌ హేక్మత్యార్‌, ఇతర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఈ పరిణామాన్ని బట్టి.. అఫ్ఘాన్‌ సర్కారు అధికార బదలాయింపునకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఆదివారం సాయంత్రం తాలిబన్ల బృందం అధ్యక్ష భవనంలో చర్చలకు వెళ్లింది. అయితే.. లోపల ఏం జరిగిందనే విషయం బయటకు రాలేదు. ఈ లోగా.. అఫ్ఘాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ప్రత్యేక విమానంలో తజికిస్థాన్‌కు బయలుదేరారు. ఆయన తజికిస్థాన్‌ చేరుకున్నాక.. అధ్యక్ష భవన వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. కీలక సమయంలో అష్రఫ్‌ ఘనీ పారిపోయాడంటూ ప్రభుత్వ పెద్దలు శాపనార్థాలు పెట్టారు.


''ఘనీ, ఆయన అనుచరులు శాపానికి అర్హుడు. దేవుడు అతణ్ని క్షమించడు'' అని అఫ్ఘాన్‌ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్‌ మహమ్మదీ, మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ అన్నారు. ఈజిప్ట్‌ పత్రిక 'డెయిలీ న్యూస్‌' మాత్రం.. అష్రఫ్‌ ఘనీ తాత్కాలిక అధికార బాధ్యతలను తాలిబన్‌ నేత ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు అప్పగించినట్లు తన వెబ్‌ ఎడిషన్‌లో కథనాలను ప్రచురించింది. అఫ్ఘాన్‌ ప్రభుత్వ అధినేతలు ఓ సమన్వయ మండలిగా ఏర్పడ్డారు. వారు త్వరలో తాలిబన్‌ నేతలతో సమావేశమవుతామని ప్రకటించారు. కాగా, తాలిబన్లు తమ దేశం పేరును 'ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్‌ అఫ్ఘానిస్థాన్‌'గా ప్రకటించారు. వారు తమ దేశ కొత్త అధ్యక్షుడిగా అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి అలీ అహ్మద్‌ జలాలీ పేరును ఖరారు చేసినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్‌లో ఉన్నారు. అధికార పగ్గాలు చేపట్టేందుకు అక్కడి నుంచి ఉన్నఫళంగా బయలుదేరినట్లు తెలిసింది.

సాయంత్రానికి అధికారికంగా పాలనను చక్కబెట్టే వ్యవహారాల్లో తాలిబన్‌ నేతలు బిజీ అయినట్లు తెలిస్తోంది. ఇందులో భాగంగానే తమ అధికారిక రాచముద్రతో పలు డిక్రీలు జారీ చేశారు. కాబూల్‌లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వాణిజ్య కేంద్రాలు, దుకాణాల యాజమాన్యాలు ఎలాంటి ఆందోళన చెందవద్దని అందులో పేర్కొన్నారు. అయితే.. తాలిబన్ల అరాచకాలు అప్పుడే ప్రారంభమయ్యాయని పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. కాబూల్‌లో ఘర్షణలు జరిగాయని, 40 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నాయి. గెటీఅజ్మీ అనే మహిళా జర్నలిస్టు ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి సాయుధులు చొరబడ్డారని ఆమె ఓ వాయిస్‌ మెసేజ్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అఫ్ఘానిస్థాన్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వారం రోజుల్లో కాబూల్‌ను ఆక్రమిస్తామని తాలిబన్లు, అందుకు ఒకటి నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చని కాబూల్‌లోని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాలిబన్లు ఆదివారం ఉదయం అనూహ్యంగా కాబూల్‌ శివార్లలో మోహరించారు. నగరంలోనికి వెళ్లరాదంటూ తాలిబన్‌ ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు ఉన్నా.. సాయంత్రం నుంచి నగరంలోకి రావడం ప్రారంభించారు. మొత్తం 34 రాష్ట్రాలకు 29ప్రావిన్సులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అఫ్ఘాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పడనున్న నేపథ్యంలో పలు దేశాలు తమ రాయబార కార్యాలయాలను ఖాళీ చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఆదివారం తమ దేశ రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిని కాబూల్‌ విమానాశ్రయానికి తరలించింది. ఈ ప్రక్రియ కోసం 3 వేల అదనపు బలగాలను పంపినట్లు ఇటీవల అమెరికా ప్రకటించగా.. ఆదివారం 5 వేల బలగాలు చేరుకున్నాయి.


గంట సేపు గాల్లోనే ఎయిరిండియా


అఫ్ఘాన్‌లోని భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు ఎయిరిండియా ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12.45కు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం గంటన్నరలో కాబూల్‌లో దిగాల్సి ఉంది. అయితే.. కాబూల్‌ విమానాశ్రయంలో ఏటీసీ సిబ్బంది భయంతో ఇళ్లకు వెళ్లిపోవడంతో.. ఎయిరిండియా విమానానికి అనుమతులు లభించలేదు. దీంతో ఆ విమానం గంటపాటు గగనతలంలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. తర్వాత 129 మంది ప్రయాణికులతో సాయంత్రం 5.35కు ఆ విమానం భారత్‌కు బయలుదేరింది.

విమానాశ్రయం ఒక్కటే దారి?

మళ్లీ తాలిబన్ల అరాచక పాలన వస్తుందనే భయంతో చాలా మంది అఫ్ఘాన్‌ పౌరులు విదేశాలకు పయనమవుతున్నారు. అఫ్ఘాన్‌ సరిహద్దులన్నీ తాలిబన్ల వశమైన నేపథ్యంలో.. వారికి ఉన్న ఒకేఒక్క దారి కాబూల్‌ విమానాశ్రయం. దీంతో.. కాబూల్‌ విమానాశ్రయానికి అధికారిక, అనధికారిక వర్గాల తాకిడి పెరిగింది.అఫ్గాన్‌లో తాలిబన్‌ రాజ్యం

రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు

తలవంచిన అష్రాఫ్‌ ఘనీ ప్రభుత్వం

రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయిన అష్రాఫ్‌ ఘనీ

శాంతియుతంగా అధికార మార్పిడి జరగాలి

తాలిబన్‌ ప్రతినిధుల స్పష్టీకరణ

కో-ఆరి్డనేషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తామన్న హమీద్‌ కర్జాయ్‌కాబూల్‌

అఫ్గానిస్తాన్‌ పునర్నిర్మాణం ఒక విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తాలిబన్లకు అందివచి్చన అవకాశం మారింది. దేశాన్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆదివారం అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లోకి దర్జాగా ప్రవేశించారు.

ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక నగరంలో పాగా వేశారు.


తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గాన్‌ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్‌ ప్రతినిధులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు. అఫ్గాన్‌ సర్కారు నుంచి తాలిబన్లకు అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో-ఆరి్డనేషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ ప్రకటించారు.


అమ్మో... తాలిబన్‌ పాలన

కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించడం గమనార్హం. అఫ్గాన్‌ భద్రతా దళాలను బలోపేతం చేసేందుకు అమెరికా, నాటో ఇప్పటిదాకా వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినప్పటికీ అదంతా వృథా ప్రయాసగా మారింది. అఫ్గాన్‌ సైన్యం తాలిబన్లకు కనీసం ఎదురు నిలువలేకపోయింది. రాజధాని కాబూల్‌ తాలిబన్ల పరం కావడానికి కనీసం నెల రోజులైనా పడుతుందంటూ అమెరికా సైన్యం వేసిన అంచనాలు తారుమారయ్యాయి. తాలిబన్ల అరాచక పాలనలో బతకలేమంటూ అఫ్గాన్లు, విదేశీయులు అఫ్గానిస్తాన్‌ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ దాచుకున్న సొమ్మును వెనక్కి తీసుకొనేందుకు జనం ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. కొందరు పేదలు తమ ఇళ్లను వదిలేసి పార్కులు, బహిరంగ ప్రదేశాలకు చేరుకుంటున్నారు. తమ పౌరులను అఫ్గాన్‌ నుంచి వెనక్కి రప్పించేందుకు అమెరికాతో సహా చాలా దేశాలు ఆత్రుత పడుతున్నాయి. ఆదివారం కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని అమెరికా సైన్యం హెలికాప్టర్లలో కాబూల్‌ ఎయిర్‌పోర్టులోని ఔట్‌పోస్టుకు తరలించింది.


కో-ఆరి్డనేషన్‌ కౌన్సిల్‌

తాలిబన్లతో చర్చలు జరపడానికి, దేశంలో అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో-ఆరి్డనేషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయనున్నట్లు అఫ్గానిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ కౌన్సిల్‌లో గుల్బుదీన్‌ హెక్మాత్యార్, అబ్దుల్లా అబ్దుల్లాతోపాటు తాను కూడా సభ్యులుగా ఉంటామని తెలిపారు. కాబూల్‌ వీధుల్లో అలజడి, అశాంతిని నియంత్రించాలని తాలిబన్లకు, అఫ్గాన్‌ సైనికులకు హామీద్‌ కర్జాయ్‌ సూచించారు. అఫ్గాన్‌లో శాంతిని స్థాపించేందుకు, అధికార బదిలీ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అందరూ చొరవ తీసుకోవాలని కోరారు. మరోవైపు తాలిబన్ల ముందు తాను ఎప్పటికీ తల వంచబోనని అఫ్గాన్‌ మొదటి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ తేల్చిచెప్పారు.


ఇకపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌

అఫ్గానిస్తాన్‌ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవన నుంచే ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అమెరికా సైన్యం రాకముందు తాలిబన్ల పాలన కొనసాగుతున్నప్పుడు అఫ్గాన్‌కు ఇదే పేరు ఉండేది.


కాబూల్‌ విమానాశ్రయంలో కాల్పులు!

కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఆదివారం రాత్రి తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. కాబూల్‌ విమానాశ్రయంలో కాల్పులు జరిగినట్లుగా సమాచారం అందుతోందని, అందువల్ల అమెరికన్లు ఎక్కడివారక్కడే సురక్షితంగా తలదాచుకోవాలని సూచించింది. 'కాబూల్‌లో పరిస్థితి క్షీణిస్తోంది. విమానాశ్రయంలో భద్రత ప్రమాదంలో పడింది. వేగంగా పరిస్థితి దిగజారుతోంది. విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడివారక్కడ సురక్షితంగా ఉండండి. రాయబార కార్యాలయంలో అధికారిక విధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఈ సమయంలో ఎవరూ ఎంబసీకి, విమానాశ్రయానికి రావొద్దు' అని కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.


జెండాను కూడా తీసుకెళ్లిన అమెరికా

అఫ్గానిస్తాన్‌లో అమెరికా రాయబారి రాస్‌ విల్సన్‌ కాబూల్‌లోని దౌత్య కార్యాలయాన్ని వదిలేసి ఆదివారం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఎంబసీపై ఎగురుతున్న అమెరికా జాతీయ జెండాను తొలిగించి మరీ వెంట తీసుకుపోయారు. కాగా రాయబార కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లను అమెరికా సిబ్బంది దగ్ధం చేశారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు విషమిస్తుండడంతో అమెరికా ప్రభుత్వం మరో 1,000 మంది సైనికులను ఆదివారం కాబూల్‌కు తరలించింది. ఇప్పటికే అక్కడ ఉన్న తమ 4,000 మంది సైనికులకు సహకరించేందుకు వీరిని కువైట్‌ నుంచి తరలించినట్లు తెలిపింది.


అధ్యక్ష భవనం స్వాధీనం

అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ రాజీనామా చేయడంతో అఫ్గాన్‌ అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కాబూల్‌లో అల్లర్లు, లూటీలు జరగకుండా నివారించడానికే తాలిబన్లు నగరంలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిదీన్‌ ప్రకటించారు. సైనిక దళాలు ఖాళీ చేసిన ఔట్‌పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాలి్సన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆదివారం కాబూల్‌ శివార్లలో జరిగిన ఘర్షణల్లో 40 మంది గాయపడినట్లు తెలిసింది.

 


ఆ ఆరుగురు కీలకం

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌ ముఠా వ్యవస్థాపకుడైన ముల్లా మొహమ్మద్‌ ఒమర్‌ అమెరికాలో జరిగిన సెప్టెంబర్‌ 11 దాడుల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2013లో మరణించాడు. ఈ విషయం రెండేళ్ల తర్వాత అతడి కుమారుడు స్వయంగా ప్రకటించడంతో బయటి ప్రపంచానికి తెలిసింది. ఒమర్‌ మరణం తర్వాత తాలిబన్లలో ఆరుగురు వ్యక్తులు కీలక నాయకులుగా ఎదిగారు. ప్రస్తుతం ఆ ఆరుగురే తాలిబన్లకు మార్దనిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వారు ఎవరంటే..


హైబతుల్లా అఖుంజాదా

దాదాపు 60 ఏళ్ల వయసున్న హైబతుల్లా అఖుంజాదా మతం పట్ల నిష్ట కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందాడు. తాలిబన్‌ రాజకీయ, మత, సైనిక వ్యవహారాలపై పూర్తి పట్టు సాధించాడు. ఇస్లామిక్‌ న్యాయ నిపుణుడైన హైబతుల్లాను తాలిబన్‌ సుప్రీం లీడర్‌గా పరిగణిస్తుంటారు. 2016లో అఫ్గాన్‌-పాకిస్తాన్‌ సరిహద్దులో అమెరికా డ్రోన్‌ దాడిలో హతమైన అఖ్తర్‌ మన్సూర్‌ నుంచి అతడు ఈ బాధ్యతలు స్వీకరించాడు. అంతకు ముందు పాకిస్తాలోని కుచ్లాక్‌లో ఓ మసీదులో మత గురువుగా పనిచేశాడు. ప్రస్తుతం ఎక్కడున్నాడో తాలిబన్లకు తప్ప ఎవరికీ తెలియదు.


ముల్లా మొహమ్మద్‌ యాకూబ్‌

తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా మొహమ్మద్‌ ఒమర్‌ కుమారుడే ఈ యాకూబ్‌. తాలిబన్‌ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షిస్తుంటాడు. ప్రస్తుతం అఫ్గాన్‌లోనే ఉన్నాడు. 2016లో తాలిబన్లకు సుప్రీం లీడర్‌ కావాలి్సన యాకూబ్‌ తాను ఇంకా కుర్రాడినేని, తగిన అనుభవం లేదన్న కారణంతో వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం అతడికి దాదాపు 30 ఏళ్ల వయసుంటుందని సమాచారం.


సిరాజుదీ్దన్‌ హక్కానీ

ముజాహిదీన్‌ కమాండర్‌ జలాలుదీ్దన్‌ హక్కానీ కుమారుడు సిరాజుదీ్దన్‌ హక్కానీ. అఫ్గాన్‌లో హక్కానీ నెట్‌వర్క్‌కు లీడర్‌గా చెలామణి అవుతున్నాడు. పాకిస్తాన్‌-అఫ్గానిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాన్ని తన కార్యక్షేత్రంగా మార్చుకున్నాడు. తాలిబన్‌ ఆర్థిక, సైనిక వ్యవహారాలు, నిధుల సేకరణ, పంపిణీ వంటివి ఇతడి కనుసన్నల్లోనే సాగుతుంటాయి. ఆత్మాహుతి దాడులు చేయడంలో హక్కానీలు దిట్టలు. సిరాజుదీ్దన్‌ వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం అతడి జాడ తెలియదు. ముల్లా అబ్దుల్‌ గనీ బరాదర్, షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్, అబ్దుల్‌ హకీం హక్కానీ సైతం తాలిబన్‌ బృందంలో కీలకమైన నేతలుగా గుర్తింపు పొందారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top