రైతులకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(ప్రధాని-కిసాన్) యోజన పథకం కింద 9వ విడత నగదును బదిలీ చేసేందుకు సిద్ధమైంది.
ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నిధులను విడుదల చేయనున్నట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. మొత్తంగా 12 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో సోమవారం రోజు రూ.19,500 కోట్ల నగదును జమ చేయనుంది కేంద్ర సర్కార్.. ఇక, ఈ సందర్భంగా రైతులతో సంభాషించనున్నారు ప్రధాని మోడీ. కాగా, ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఏడాది మూడు విడుతలలో ఈ మొత్తాన్ని విడుదల చేస్తోంది కేంద్రం.. ఒక్కొక్క విడుతలలో రూ.2 వేలుగా..
మూడు సార్లు ఈ సొమ్మును జమ చేస్తూ వస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు రూ.1.38 లక్షల కోట్లకు పైగా సమ్మాన్ రాశిని రైతు కుటుంబాలకు బదిలీ చేసింది కేంద్రం.
0 Comments:
Post a Comment