రాష్ట్రంలోని అంగన్వాడీ, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల 30 శాతం పీఆర్సీ పెంచిన నేపథ్యంలో ఈ వర్గానికి కూడా వేతన పెంపును వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ టీచర్లకు గతంలో రూ. 10,500 వేతనం ఉండగా.. దాన్ని రూ. 13,650కి పెంచారు. మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.6 వేలు ఉండగా.. రూ. 7,800 చొప్పున పెంచారు. అంగన్వాడీ ఆయాలకు రూ. 6 వేలు వేతనం ఉండగా.. రూ. 7,800కు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వేతన పెంపు వర్తింపు జూలై నుంచి అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
కాగా అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచుతూ జీవో జారీ చేసినందుకు తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు భిక్షమమ్మ, కార్యదర్శి సుమాంజలి, వైస్ ప్రెసిడెంట్నిర్మల, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్యూనియన్రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, వి.నిర్మల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
0 Comments:
Post a Comment