విజయవాడ : విద్యార్థి మరణం కేసులో ప్రధానోపాధ్యాయురాలి సస్పెన్షన్..
ఘటన పట్ల సీఎం స్పందన - మృతుని కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం..
ఏపీ లోని కృష్ణాజిల్లా నందిగామ శివారు అనసాపురం జడ్పీ హైస్కూల్ ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ సీరియస్ అయ్యారు. పాఠశాల విద్యార్థులను పనులకు ఉపయోగించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాలలో విద్యార్థి విద్యుత్ షాక్ తో మృతి చెందడం బాధాకరమని మంత్రి అన్నారు. ఈ సంఘటనపై తక్షణమే ప్రాథమిక నివేదిక తెప్పించమని మంత్రి తెలిపారు. నరసాపురం ఘటనపై ఆర్ జె డి తో విచారణ జరిపిస్తామని వెల్లడించారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పాఠశాలలో పనులకు నియమించుకున్న ఆయాలను ఉపయోగించుకోవాలని మంత్రి తెలిపారు. ఎక్కడైనా విద్యార్థులతో పనులు చేస్తున్నట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని మంత్రి అన్నారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని స్పష్టం చేశారు.
Crime News: విద్యుదాఘాతంతో పదో తరగతి విద్యార్థి మృతి
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో విషాదం చోటుచేసుకుంది. నందిగామ శివారు అనాసాగరం జడ్పీ హైస్కూల్లో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.
మృతుడు పదో తరగతి చదువుతున్న గోపీచంద్‌గా (15) పోలీసులు గుర్తించారు. గోపీచంద్‌ను పాఠశాలలోని వాటర్ ట్యాంక్ శుభ్రం చేయాలని ఉపాధ్యాయులు సూచించారు. వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే గోపీచంద్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి అప్పటికే మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడే వాటర్ ట్యాంక్ శుభ్రం చేయాల్సిందిగా చెప్పారని.. ఘటన జరిగిన వెంటనే అక్కడ నుంచి కనిపించకుండా వెళ్లిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు.
0 Comments:
Post a Comment