Academic year 2021-22 Opening of schools and learning with physical/social distancing duly following the COVID protocol and Standard Operating Procedures(SOPs) on various activities in schools for Academic Year 2021 -22-Orders
📚✍సెక్షన్‌కు 20మందే విద్యార్థులు📚
♦సంఖ్య ఎక్కువగా ఉంటే రోజు విడిచి రోజు తరగతులు
🌻ఈనాడు-అమరావతి
కరోనా నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు వేసవి సెలవులు అనంతరం సోమవారం పునఃప్రారంభం అవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు అన్ని యాజమాన్యాలు ఆరోజునే స్కూళ్లు తెరవాలని సూచిస్తూ జిల్లా విద్యాశాఖ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలలు తాము ఎప్పుడు తెరిచేది రెండు రోజుల ముందు సమాచారమిస్తామని శనివారం విద్యార్థులకు సంక్షిప్త సమాచారం పంపాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. విద్యాశాఖ అధికారులు మాత్రం అన్ని పాఠశాలల నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వం ఒకే మార్గదర్శకాలు జారీ చేసిందని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖతో సంప్రదించి పాఠశాలల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యార్థులు పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రధానోపాధ్యాయులకు పంపారు. వాటిని కచ్చితంగా అమలు చేయాలని, ప్రైవేటు యాజమాన్యాలు ఆ రోజునే పాఠశాలలు ఆరంభించాలని సూచించామని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.ఎస్.గంగాభవానీ తెలిపారు. జిల్లాలో 3651 పాఠశాలలను శుభ్రం చేసుకుని మాస్కులు, శానిటైజర్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఇంతకు ముందే ప్రధానోపాధ్యాయులకు సూచించినట్లు వెల్లడించారు.
♦కొవిడ్ కేంద్రంలో ఆరుగురు చిన్నారులు
అడవితక్కెళ్లపాడు కొవిడ్‌కేర్ సెంటర్లో ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. అయితే వీరికి ఇంకా కరోనా నిర్ధారణ కాలేదని వైద్యులు తెలిపారు. అనుమానిత లక్షణాలతో వారు ఇక్కడ చేరారు. కరోనా తగ్గుముఖం పటట్టడంతో అన్ని కొవిడ్ కేంద్రాలు మూసినా గుంటూరు నగరంలో అడవితక్కెళ్లపాడులో కొనసాగిస్తున్నారు. ఒకవేళ పాఠశాలల్లో అనుమానిత లక్షణాలతో పిల్లలు ఉంటే వారిని అంబులెన్స్‌ల్లో ఇక్కడకు తీసుకొచ్చి ప్రత్యేక వైద్యపరీక్షలు చేయించడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు వైద్యాధికారులతో సంప్రదిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో చిన్న పిల్లలకు సంబంధించి కరోనాతో ఒకే ఒక్కరు చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
👉ఇవీ మార్గదర్శకాలు👇
* ఏదైనా గ్రామం, సచివాలయం పరిధిలో పాజిటివ్ రేటు పది శాతం కన్నా తక్కువగా ఉంటేనే పాఠశాలలు తెరవాలి. ప్రతి సెక్షన్‌కు 20 మంది విద్యార్థులకు మించి కూర్చోబెట్టకూడదు. అంతకు మించి పిల్లలు ఉంటే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే రోజువిడిచి రోజుల తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి.
* ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాన్ టీచింగ్ సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలి. చేతి పరిశుభ్రత, సామాజిక దూరం పాటించేలా తరచూ తరగతి ఉపాధ్యాయుడే పర్యవేక్షించాలి. హెచ్ఎంలు ఈ విషయంలో పక్కా ప్రణాళికను రూపొందించి, అమలు చేయాలి
* జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలతో పిల్లలు ఎవరైనా పాఠశాలకు వస్తుంటే వారిని ప్రవేశ ద్వారం వద్దే గుర్తించి వెనక్కు పంపాలి. లేదా వారిని కొవిడ్‌కేర్ కేంద్రాలకు పంపాలి. అనుమానిత లక్షణాలను నిర్దారించుకోవటానికి ప్రతి పాఠశాలలో పోర్టబుల్ థర్మల్ స్కానర్ అందుబాటులో ఉంచుకోవాలి.
* తిరిగి ఆదేశాలిచ్చే వరకు పాఠశాలలో అసెంబ్లీ, క్రీడలు నిర్వహించకూడదు. విద్యార్థులను గుంపులు గుంపులుగా వదలకూడదు.
* మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు కూడా పిల్లలు సామాజిక దూరం పాటించేలా హెచ్ఎం, వ్యాయామోపాద్యాయుడు పర్యవేక్షించాలి. ఒకేసారి పిల్లలందరికి వడ్డన చేయకుండా కొంత గ్యాప్ ఉండేలా చూడాలి.
* పాఠశాల ముగిసే సమయంలో పిల్లలను ప్రతి తరగతి గదికి కొంత వ్యవధి పాటించి బయటకు పంపాలి. ఇళ్లకు వెళ్లిన వెంటనే ప్రతి విద్యార్థి స్నానం చేయాలని, అవగాహన కల్పించాలి.
* పెన్నులు, పెన్సిళ్లు, బాటిళ్లు, గ్లాస్, ప్లేట్లు తదితర వస్తు సామగ్రి ఒకరికొకరు పంచుకోకుండా, ప్రతి క్లాసులో ఉపాధ్యాయులతో చెప్పించాలి. ఈ విషయం నోటీసుబోర్డులో పెట్టాలి.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Comments:
Post a Comment