Acceptance of PRC implementation
పీఆర్సీ అమలుకు అంగీకారం
ప్రభుత్వ ఉద్యోగుల 11వ పీఆర్సీ అమలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించారని ఎన్జీవో సంఘం రాష్ట్రాధ్యక్షుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ప్రభుత్వ అతిథి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11వ పీఆర్సీ అమలుపై గతనెలలో ఎన్జీవో సంఘం నాయకులు ముఖ్యమంత్రిని కలిసి వివరించామన్నారు. పీఆర్సీ అమలుకు ఆయన అంగీకరించడమే కాకుండా ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాథ్ దాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై పీఆర్సీ అమలుకు ప్రణాళిక రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. పీఆర్సీ అమలు, మహిళా ఉద్యోగుల సమస్యలు, సీపీఎస్ రద్దు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా అందుతున్నాయని, ఇందుకు ఆర్థిక శాఖ అధికారులు, సీఎఫ్ఎంఎస్ విధానమే ప్రధాన కారణమన్నారు. ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు వెంగళరెడ్డి, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment