Biometric is mandatory
బయోమెట్రిక్ తప్పనిసరి
ఉద్యోగులందరూ హాజరు నమోదు చేసుకోవాలి: గంధం చంద్రుడు
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు ఆదేశించారు.
కరోనా వల్ల ఈ విధానానికి కొంత వెసులుబాటు కల్పించినా ప్రస్తుతం ప్రతి ఉద్యోగి బయోమెట్రిక్ అటెండెన్స్‌ను నమోదు చేసుకోవాలని, తదనుగుణంగా శాఖలోని విభాగాల అధినేతలు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గురువారం మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఉద్యోగుల హాజరు, పని విధానాన్ని పరిశీలించారు. స్టేట్ మైనార్టీస్ కార్పొరేషన్, వక్ఫ్‌బోర్డు, ఏపీ హజ్ కమిటీ కార్యాలయాల్లో పరిశీలించారు. ఫైళ్లకు సంబంధించి తప్పనిసరిగా ఈ ఆఫీస్ విధానాన్ని మాత్రమే పాటించాలని, భౌతిక విధానాన్ని అంగీకరించబోమని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment