గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే కార్యదర్శులకు సెప్టెంబర్ 15వ తేదిన శాఖాపరమైన పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను ఎపి పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అప్పగించారు. ప్రభుత్వమే తేదీలను ఖరారు చేసి, వాటిని అమలు చేసేలా కమిషన్‌కు లేఖ రాసింది. ప్రధానంగా 19 విభాగాల్లో కార్యదర్శులు పనిచేస్తుండగా, అందులో ఎనిమిది శాఖల కార్యదర్శులకు డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మహిళా పోలీస్‌గా మారిన మహిళా సంరక్షణ కార్యదర్శులతోపాటు మరో ఏడు విభాగాల కార్యదర్శులకు డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. సంక్షేమ, విద్య అసిస్టెంట్‌కు వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసు రూల్స్, గిరిజన సంక్షేమ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌పైనా, ఇరజనీరింగ్ అసిస్టెంట్లకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్‌పైనా, పశు సంవర్ధక అసిస్టెంట్, పిషరీస్, రెవెన్యూ అసిస్టెంట్లకు ఆయా శాఖల సబార్డినేట్ సర్వీసు రూల్స్‌పై పరీక్ష ఉంటుంది.
అయితే సెరికల్చర్, హెల్త్ విభాగాల్లో ఉన్న వారికి ఆయా శాఖల నుంచి ఇంకా పరీక్షలపై స్పష్టత రాలేదు.
కాగా, డిపార్ట్మెంట్ పరీక్షలకు సంబంధించి 20 తేదీన ఎపిపిఎస్‌సికి సిలబస్ అరదించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 15వ తేదీన ఈ సిలబస్ ఆధారంగా వారికి పరీక్షలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 22వ తేదీన ఫలితాలు వెల్లడించి, అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా అర్హత పొందిన వారికి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎపిపిఎస్కి ప్రభుత్వం నుంచి లేఖ అందింది.
0 Comments:
Post a Comment