మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబు కూలి విద్యార్థి మృతి చెందాడు.
ఆదివారం సెలవు కావడంతో పలువురు విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఆడుకునేందుకు వెళ్లారు. విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా భవనం పైకప్పు కూలడంతో విష్ణు అనే విద్యార్థి మృతి చెందాడు. విష్ణు.. మార్కాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నట్టు బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments:
Post a Comment