AP News: విజయవాడ నుంచి కర్నూలుకు హెచ్ఆర్సీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో విజయవాడలో ఏపీహెచ్ఆర్సీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులకు సవరణ చేస్తూ ఈ కార్యాలయాన్ని విజయవాడ నుంచి కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. లోకాయుక్త, ఉప లోకాయుక్తను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటివరకు లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యాలయాలు హైదరాబాద్ నుంచి పనిచేశాయి.
0 Comments:
Post a Comment