Amazon Great Freedom Festival Sale: Huge discount on smartphones
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్: స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మరో రెండురోజుల్లో స్టార్ట్ అవుతుంది. అయితే, ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన భారీ ఆఫర్లను ఇవ్వనున్నట్లు అమెజాన్ ఇప్పటినుండే టీజింగ్ మొదలుపెట్టింది. మోస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ల నుండి మొదలుకొని లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల వరకూ చాలా స్మార్ట్ ఫోన్ల పైన మంచి డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను కూడా ఈ సేల్ నుండి ప్రకటించింది.
ప్రైమ్ మెంబెర్స్ కు అదనపు సేవింగ్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రైమ్ మెంబెర్స్ కు అదనపు అడ్వాంటేజ్ కూడా వుంది. ఎందుకంటే, ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ కొనుగోలుచేసే ప్రైమ్ మెంబెర్స్ కు No Cost EMI అప్షన్ ఎక్కువ నెలలు ఇన్స్టాల్ మెంట్ తో అందుతుంది.
దీని వలన నెలనెలా చెల్లించే EMI వాయిదా అమౌంట్ చాలా తక్కువగా మరియు సులభంగా వుంటుంది. ఇది మాత్రమే కాదు ఫోన్ ధరను బట్టి 6,000 నుండి 19,000 రూపాయల వరకూ స్క్రీన్ రీప్లేస్ మెంట్ ని ఎటువంటి అదనపు రుసుము లేకుండా అఫర్ చేస్తోంది.
ఇక ఇతర డీల్స్ గురించి చూస్తే, టీవీలు మరియు వాషింగ్ మెషీన్స్ వంటి అప్లయన్సెస్ పైన గరిష్టంగా 55% వరకూ భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. అంటే, ఈ అమెజాన్ సేల్ నుండి బ్రాండెడ్ టీవీ లేదా వాషింగ్ మెషిన్ ను కేవలం సగం ధరకే పొందేవీలుంటుంది. No cost EMI, ఎక్స్చేంజ్ అఫర్ మరియు కావాల్సిన సమయానికి ప్రోడక్ట్స్ ని ఇంటి వద్ద అందుకునే విధంగా షెడ్యూల్డ్ డెలివరీ అవకాశం కూడా వుంది.
0 Comments:
Post a Comment