12,539 పాఠశాలల్లో తరగతుల తరలింపు
నేటి నుంచే ప్రారంభం
🌻ప్రజాశక్తి - అనురావతి బ్యూరో
ప్రాథమిక పాఠశాలల్లోని తరగతుల తరలింపు విషయంలో అన్ని వర్గాల నుండి వ్యతిరేకత వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 33,813 ప్రాథమిక పాఠశాలలుండగా, వాటిలో 12,539 పాఠశాలల్లో 3,4,5 తరగతులను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023 24 విద్యాసంవత్సరంలోపు కిమీ పరిధిని మించిన అన్ని ప్రాథమిక పాఠశాలల్లోనూ ఈ ప్రక్రియను చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.. అయితే, కిమీ మించిన దూరానికి ప్రాథమిక పాఠశాలలను తరలించడం విద్యాహక్కు చట్టానికి విరుద్ధం. దీనిని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తే తరలించుకోవచ్చన..నిబంధనను విద్యాశాఖ తీసుకురానున్నట్లు సమాచారం. దీని ఆధారంగా తల్లితండ్రులు కోరుతున్నారని చెబుతూ.. మిగిలి పాఠశాలల్లో కూడా తరగతులను తరలించనున్నారు. ఈ విద్యాసంవత్సరం 3,178 ఉన్నత పాఠశాలలకు దగ్గరగాఉన్న 3,627 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను తరలించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. సోమవారం తూర్పు గోదావరి జిల్లా సి గన్నవరంలో జరిగే జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ విధివిధానాలను ప్రకటించేఅవకాశం ఉంది. ప్రస్తుతానికి తరలించిన తరగతులు ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగుతాయి. హైస్కూళ్లల్లో గదులు కొరత కారణంగా 3,4,5 తరగతులను ఈ ఏడాది ప్రాథమిక పాఠశాలలో కొనసాగనున్నాయి. అయితే, వీటి పర్యవేక్షణ మాత్రం హైస్కూళ్లలోని ప్రధానోపాధ్యాయుల పరిధి కిందకే వస్తుంది. ఈ 3,4,5 తరగతులకు హైస్కూల్లోని సబ్జెక్టు టీచర్లతో బోధిస్తారు. ఈ హైస్కూళ్లల్లో 3వ తరగతి నుంచే సిబిఎస్ఇ సిలబస్ బోధన ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తరగతి గదుల నిర్మాణం జరగ్గానే విభజించిన తరగతులను హైస్కూళ్లకు తరలిస్తారు. నాడు- నేడు పథకం కింద రెండేళ్లల్లో అదనపు తరగతుల నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొత్తం 27 వేల తరగతి గదులు అవసరమవుతాయని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది.
0 Comments:
Post a Comment