1 dose Covaxin enough for Covid-hit: ICMR
కొవాగ్జిన్ ఒక్క డోసు చాలు
ఐసీఎంఆర్ కీలక ప్రకటన
కరోనా బారిన పడిన వారిలో మంచి ఫలితాలు
రెండు డోసులుతీసుకున్న వారితో సమానంగాయాంటీబాడీలు
🌻న్యూఢిల్లీ: కొవాగ్జిన్ సమర్థతపై ఇండి యన్ మెడికల్ కౌన్సెల్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఒకసారి కరోనా బారినపడిన వారు కొవాగ్జిన్ టీకా ఒక డోసు తీసుకుంటే సరిపోతుందని తెలిపింది. సాధారణ వ్యక్తులు రెండు డోసులు తీసుకోవడం వల్ల ఉత్పత్తయ్యే యాంటీబాడీలతో సమానంగా వీరిలో ఒక డోసుతోనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని తెలిపింది. ఈ మేరకు తమ ! తాజా అధ్యయనంలో తేలిందని వెల్లడించింది.
ఇటీవలి అధ్యయనంలో కొవిడ్ బారిన వ్యక్తులు కొవాగ్జిన్ ఒక మోతాదు తీసుకున్నప్పుడు ఏర్పడే ప్రతిస్పందన, ఇతరులు రెండు డోసులు తీసుకున్నప్పుడు కలిగే ప్రతిస్పందన ఒకేలా ఉన్నట్లు రూఢీ అయినట్లు చెప్పింది. ఇటీవల ఆరోగ్యకార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై పైలట్ అధ్యయనం జరిగింది. ఇందులో వాక్సినేషన్‌కు ముందు రోజు యాంటీబాడీల సామర్థ్యం, తొలిడోసు తీసుకున్న తర్వాత 28 రోజులకు యాంటీబాడీల సామర్థ్యాన్ని పరీక్షించారు. 2021 ఫిబ్రవరి నుంచి మే వరకు చెన్నైలోని టీకా కేంద్రాల్లో బీబీవీ 152 వ్యాక్సిన్ పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల నుంచి రక్త నమూనాలు సేకరిం చారు. ఫలితాలను పోల్చిచూశారు. ఐసీఎంఆర్-ఎస్ఐఆర్ నిపుణుల కమిటీ ఈ అధ్యయనాన్ని ఆమోదించింది. యాంటీబాడీ స్థాయిలను మూడు వ్యవధుల్లో లెక్కించారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, తొలిడోసు తీసుకున్న నెలరోజులకు, రెండవ డోసు తీసుకున్న రెండు నెలలకు రక్తనమూనాలు పరీక్షించా రు. ఈ అధ్యయనం పబ్లిక్ హెల్త్-ఓరియెంటెడ్ అండ్ ఇమ్యూనోలాజికల్గా నిరంతర టీకా వ్యూహాలకు మద్దతునిచ్చేలా ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త లోకేశశ ర్మ చెప్పారు. ఇది పైలట్ అధ్యయనమే. మరింత మందిపై పరిశీలించాలి. అప్పుడు కూడా ఇదేవిధమైన ఫలితాలు నిర్ధారించబడితే, గతంలో నిర్దారించబడిన కొవిడ్ రోగులకు కొవాగ్జిన్ సింగిల్ డోసు టీకాను సిఫార్సు చేయవచ్చు అని అన్నారు.
0 Comments:
Post a Comment