Do you know what this code on the cooking gas cylinder means?
వంట గ్యాస్ సిలిండర్‌పై ఉండే ఈ కోడ్‌కు అర్థం ఏమిటో తెలుసా ?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల స్కీములను అందుబాటులోకి తేవడంతో ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎల్పీజీ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. చాలా మంది ఎల్పీజీ సిలిండర్లను వంటకు వాడుతున్నారు.
అయితే ఎల్పీజీ సిలిండర్లపై కొన్ని రకాల కోడ్స్ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు కదా. అవును.. వాటిపై చిత్రంలో చూపిన విధంగా B-13 అనే కోడ్స్ ఉంటాయి. అయితే వాటికి అర్థం ఏమిటో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు ఏడాదిలో 12 నెలలు ఉంటాయి కదా. వాటిని 4 భాగాలుగా విభజిస్తారు. A, B, C, D అని ఉంటాయి. ఈ క్రమంలో A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి అని అర్థం. అలాగే B అంటే ఏప్రిల్, మే, జూన్ అని, C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అని, D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని అర్థం చేసుకోవాలి
ఇక పైన తెలిపిన కోడ్‌ను ఒకసారి డీకోడ్ చేస్తే.. B-13 అంటే.. సదరు సిలిండర్‌కు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 2013 సంవత్సరంలో టెస్టింగ్ చేయాలి అని అర్థం. మనకు సరఫరా చేసే సిలిండర్లపై ఇవే కోడ్లు ఉంటాయి. అయితే మనకు వచ్చే సిలిండర్లపై టెస్టింగ్ అయిపోయిన ఏడాది ఉండదు. టెస్టింగ్ కాబోయే ఏడాది రాసి ఉంటుంది.
అంటే ఇప్పుడు 2021 కనుక మనకు వచ్చే సిలిండర్లపై B-22 అని ఉంటుంది. ఇలా నెలలను బట్టి కోడ్లు మారుతాయి. Bకి బదులుగా A, C, Dలు కూడా ఉండవచ్చు. ఆ కోడ్‌ను అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఆ కోడ్‌లో ఉన్న ఏడాది గడిచాక మనకు సిలిండర్ వస్తే దాన్ని వాడకూడదని, ప్రమాదమని గుర్తించాలి. ఎందుకంటే టెస్ట్ చేయాల్సిన సంవత్సరం దాటి పోతుంది కనుక ఆ సిలిండర్‌ను వాడకూడదు. అలాంటి సందర్భాల్లో జాగ్రత్తలు వహించాలి.
TS SSC Results 2022
ReplyDelete