Walking Extends Your Life : నడక మంచిదే.. ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఆయుష్షుని పెంచుతుంది
Walking Extends Your Life : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. పర్యావరణం, ఆహారం, జీవనశైలిలో మార్పులు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. తక్కువ వయసులో రోగాలతో మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే, ఆయుష్షు పెరగాలంటే ఏం చేయాలి..? అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. అందుకు నిపుణులు చెబుతున్న సమాధానం నడక. అవును నడక వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు. నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు ఆయుష్షుని పెంచుతుంది కూడా.
ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించాలంటే కచ్చితంగా రెగులగర్ గా ఎక్సర్ సైజులు ఎంతో ఉపయోగపడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. సర్ఫింగ్, రన్నింగ్, ప్లేయింగ్.. ఇవన్నీ కూడా జీవిత కాలాన్ని పెంచేవే. వీటి సంగతి పక్కన పెడితే.. వాకింగ్(నడక) ఆరోగ్యానికి మరింత మంచిదని నిపుణులు అంటున్నారు. బ్రిస్క్ స్పేస్ లో నడక వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.
బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో వచ్చిన అధ్యయనం ప్రకారం.. బ్రిస్క్ పేస్ లో వాకింగ్ వల్ల మరణం ముప్పు 20శాతం వరకు తగ్గింది. మెల్లగా నడిచే మహిలు 72ఏళ్లు జీవించగా, ఫాస్ట్ గా నడిచే మహిళలు 87ఏళ్లు పాటు జీవించారు. ఇక పురుషుల విషయానికి వస్తే వేగంగా నడిచే వాళ్లు 86ఏళ్లు జీవించగా, నిదానంగా నడిచే పురుషులు 65ఏళ్లు జీవించినట్టు అధ్యయనంలో తెలిసింది. ఓ టాప్ సైంటిస్టు ప్రకారం.. బ్రిస్క్ పేస్ లో నడక 20ఏళ్ల ఆయుష్షు పెంచుతుందన్నారు.
నడక.. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్:
ఎక్కువ సేపు కూర్చోవడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ప్రతి గంటకు రెండు గంటల ఆయుష్షు కోల్పోయినట్టే. కూర్చోవడం స్మోకింగ్ కన్నా డేంజరస్. హెచ్ఐవీ ద్వారా చనిపోయిన వారికన్నా ఎక్కువమంది చనిపోయారు. ఓ అధ్యయనం ప్రకారం నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ప్రమాదకర ప్రభావాలను నడక తగ్గిస్తుంది. గంట సేపు కూర్చుంటే మూడు నిమిషాల పాటు ఎక్సర్ సైజు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా 8 గంటల పాటు సిస్టమ్ ముందు కూర్చునే వారు.. ప్రతి రోజూ నడవడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చు.
నడక.. మరణం ముప్పుని ముందే తెలుపుతుంది…
నడక.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరణం ముప్పుని ముందే తెలుపుతుంది. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో తెలుసుకోవడానికి బెస్ట్ టెస్ట్ మెట్లు ఎక్కడం. మెట్లు ఈజీగా ఎక్కేస్తున్నాం అంటే ఆరోగ్యంగా ఉన్నట్టే, ఆయాసంగా ఉందంటే మాత్రం.. ప్రమాదంలో ఉన్నట్టే అని నిపుణులు చెప్పారు.
నడక.. శక్తి పెంచుతుంది, రోగాల ముప్పు తగ్గిస్తుంది…
”నడక వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మంచి నిద్ర పడుతుంది. రోగాల ముప్పు తగ్గుతుంది. మొత్తంగా ఎక్కువ రోజులు బతికేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు దేహాన్ని స్లిమ్ గా ఉంచుతుంది. మీరు ఎలాంటి బాడీని కోరుకుంటారో అది దక్కుతుంది. రన్నింగ్ చేసినప్పుడు ఎన్ని పౌండ్లు కరుగుతాయో, వాకింగ్ లోనూ అంతే” అని ఫిట్ నెస్ యాప్ ఓపెన్ ఫిట్ ట్రైనర్ చెబుతారు.
ప్రతిరోజూ నడవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని అమెరికాలో నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల అధ్యయనంలోనూ తేలింది. శాస్త్రవేత్తలు ఆరోగ్యవంతులైన 4వేల 800 మందిపై మూడేళ్ల పాటు పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. తమ పరిశోధనల్లో భాగంగా 40ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న వారికి ట్రాకర్లు అమర్చి వారు నడిచిన దూరాలను పరిశీలించారు. తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ లాంటి ఆరోగ్య సూచీలను బట్టి మరణించే ప్రమాదాన్ని అంచనా వేశారు.
నడక.. గుండెని బలోపేతం చేస్తుంది..
ఎక్కువ నడక.. గుండె సంబంధ సమస్యలను నివారిస్తుంది. స్ట్రోక్ ముప్పు తగ్గిస్తుంది అని నిపుణులు చెబుతారు. రోజూ నడక వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయన్నారు. లైఫ్ స్పాన్ ని మరో రెండేళ్లు పెంచుతుంది. ఇవండీ.. నడక వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ నడకను తమ జీవితంలో భాగం చేసుకోవాలని నడక నిపుణులు సూచిస్తున్నారు. రోజూ నడవండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆయుష్షుని పెంచుకోండి అని అంటున్నారు.
0 Comments:
Post a Comment