T20 World Cup: ఒకే గ్రూపులో భారత్, పాక్
ఇంటర్నెట్‌డెస్క్: అక్టోబర్ 17 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. రెండు జట్లూ ఒకే గ్రూపులో చోటు సంపాదించుకోవడమే అందుకు కారణం. అయితే, మ్యాచ్‌ల తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఈసారి ప్రపంచకప్‌లో ఐసీసీ మొత్తం నాలుగు గ్రూప్‌లను ఏర్పాటు చేయగా అందులో గ్రూప్-ఏ, గ్రూప్-బీతో పాటు గ్రూప్-1, గ్రూప్-2 ఉంటాయి. గ్రూప్-1, గ్రూప్-2లో ప్రధాన 8 జట్లు ఇప్పటికే చోటు సంపాదించుకోగా మిగతా జట్లు గ్రూప్-ఏ, గ్రూప్-బీలో ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లోని విజేతలు, రన్నరప్ జట్లు తర్వాతి దశలో అంటే సూపర్-12కు అర్హత సాధిస్తాయి. దాంతో ఆ జట్లు గ్రూప్-1, గ్రూప్-2లో చోటు దక్కించుకుంటాయి.
ఇక టీ20 క్రికెట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న వెస్టిండీస్.. గ్రూప్-1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పోటీపడుతుండగా, మరోవైపు గ్రూప్-2లో భారత్.. పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లతో తలపడనుంది. ఈ క్రమంలోనే శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువాన్యూగినియా, ఓమన్ జట్లు గ్రూప్-బీలో చోటు సంపాదించుకున్నాయి. ఈ ఎనిమిది జట్లలో టాప్‌లో నిలిచిన నాలుగు గ్రూప్-1, గ్రూప్-2లో చివరిస్థానాల్లో నిలుస్తాయి. కాగా, ఈ పోటీలను బీసీసీఐ యూఏఈ, ఒమన్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. మరోవైపు మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
0 Comments:
Post a Comment