Staff Selection Commission (SSC) - Jobs for constables in the leading armed forces of the country.
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) - దేశంలోని ప్రముఖ సాయుధ బలగాల్లో కానిస్టేబుళ్లు, అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ డ్యూటీ క్యాడర్ కింద మొత్తం 25,271 ఖాళీలు ప్రకటించారు. మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీఈ ని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, మిగిలిన టెస్టులను CAPF లు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ SSC - GD 2021 జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : కానిస్టేబుల్ ( పురుషులు , మహిళలు)
సాయుధ బలగాల విభాగాలు: BSF - బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
SSB - శశస్త్ర సీమ బల్
AR - అస్సాం రైఫిల్స్
CISF - సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
ITBT - ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
SSF - సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్
విభాగాల వారిగా ఖాళీలు: BSF విభాగంలో 6413 పురుషులు, 1132 మహిళలు. మొత్తం 7545 కానిస్టేబుల్ జాబ్స్.
SSB విభాగంలో 3806 పురుషులు, 0 మహిళలు. మొత్తం 3806 కానిస్టేబుల్ జాబ్స్.
AR విభాగంలో 3185 పురుషులు, 600 మహిళలు. మొత్తం 3785 కానిస్టేబుల్ జాబ్స్.
CISF విభాగంలో 7610 పురుషులు, 854 మహిళలు. మొత్తం 8464 కానిస్టేబుల్ జాబ్స్.
ITBT విభాగంలో 1216 పురుషులు, 215 మహిళలు. మొత్తం 1431 కానిస్టేబుల్ జాబ్స్.
SSF విభాగంలో 194 పురుషులు, 46 మహిళలు. మొత్తం 240 కానిస్టేబుల్ జాబ్స్.
మొత్తం ఖాళీలు : 25,271
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదవ తరగతి / తత్సమాన ఉత్తర్ణత.
వయస్సు : 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉండాలి, 02/08/1998 నుండి 01/08/2003 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 22,000 - 1,50,000 /-
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎసీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ): పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మేధమెటిక్స్, ఇంగ్లీష్ / హిందీ లాంగ్వేజ్ లకు సంబందించి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సమయం గంటన్నర, ఇందులో అర్హత పొందాలంటే జనరల్ అభ్యర్థులకు 35 శాతం, రిజర్యుడు వర్గాలకు 33 శాతం మార్కులు రావాలి.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ): పురుషులు 5 కిమీల రేసుని 24 నిముషాల్లో, మహిళలు 1.6 కిమీల రేసుని ఎనిమిదిన్నర నిముషాల్లో పూర్తి చేయాలి.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎసీ): పురుషులకు కనీసం 170 సెం.మీల ఎత్తు, 80 సెం.మీల చాతి ఉండాలి. మహిళలకు 157 సెం.మీల ఎత్తు, ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, మహిళలు, ex-ఆర్మీ ,ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 17, 2021.
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 31, 2021.
0 Comments:
Post a Comment