Amazon smart offers - Price reduction up to 40%
అమెజాన్ స్మార్ట్ ఆఫర్లు
40% వరకు ధరల తగ్గింపు
బెంగళూరు, జూలై 5: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. 'స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్’ పేరుతో భారీ ఆఫర్లను తెరపైకి తెచ్చింది. వన్‌ప్లస్, షియామీ, సామ్సంగ్, యాపిల్, వివో, ఒప్పో, హానర్, లావా తదితర బ్రాండ్ల మొబైల్స్ ధరలపై 40 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. అమెజాన్.ఇన్‌లో ఈ నెల 8దాకా ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ, 9 5జీ సిరీస్‌తోపాటు సామ్సంగ్ ఎం32, ఎం సిరీస్ నూతన మోడళ్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లను ఇచ్చింది. రెడ్మీ నోట్ 10 సిరీస్, ఎంఐ 11 సిరీస్‌లపై ఎక్సేంజ్ ఆఫర్లుండగా, ఐఫోన్ 12 ధరపై రూ.9,000 తగ్గింపున్నది.
ఆయా రకాల వివో, ఒప్పో మొబైల్స్ ధరలపైనా 35 శాతం వరకు రాయితీలుండగా.. నో కాస్ట్ ఈఎంఐ, ఎస్బీఐ క్రెడిట్ కార్డుల వినియోగంపై రూ.1,250 వరకు తక్షణ డిస్కౌంట్ వర్తిస్తాయని అమెజాన్ తెలిపింది. ఇక పవర్ బ్యాంక్స్‌పై 65 శాతం డిస్కౌంట్ ఉండగా, రూ.199కే హెడ్ సెట్స్‌ను అందుబాటులో ఉంచింది. మరెన్నో మొబైల్ యాక్ససరీస్నూ అగ్గువకే అమ్మకానికి పెట్టింది.
0 Comments:
Post a Comment