Small Savings Schemes: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ స్కీమ్స్‌లో ఉన్నవారికి గుడ్ న్యూస్...
చిన్న మొత్తాలను పొదుపు చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే వార్త చెప్పింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. 2021-22 రెండో త్రైమాసికానికి మనుపటి వడ్డీ రేట్లనే కొనసాగించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్పీ), కిసాన్ వికాస్ పత్రా (కేవీపీ), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్పీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకాలపై ఈ ఏడాది జూన్ 30 వరకు ఎంత వడ్డీరేటు ఉందో.. సెప్టెంబర్ 30 వరకు పొదుపు చేసిన వారు కూడా అంతే వడ్డీ మొత్తాన్ని పొందుతారు. చిన్నమొత్తాల పొదుపుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేట్లను సవరించకుండా ఉండడం వరుసగా ఇది అయిదవసారి .
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2021 జూలై 1 నుంచి 2021 సెప్టెంబర్ 30) వరకు తొలి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయి. ఎలాంటి మార్పు లేదు' అని ఆర్థిక మంత్రిత్వశాఖ ల్లడించింది. దీంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింది సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటు అలాగే ఉండనుంది. ఎన్ఎస్సీ వార్షిక వడ్డీరేటు 6.8 శాతంగా, సుకన్య సమృద్ధి యోజన వడ్డీరేటు 7.6 శాతం, కిసాన్ వికాస్ పత్రా వడ్డీరేటు 6.9 శాతం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌కు 7.4 శాతంగా వార్షిక వడ్డీరేట్లు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగనున్నాయి. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై 6.8 శాతం, నెలవారీ ఇన్కమ్ అకౌంట్‌పై 6.6 శాతం, సేవింగ్స్ ఖాతాపై 4 శాతం ఇలా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై గత త్రైమాసికంలో ఉన్న వార్షిక వడ్డీ రేట్లే ఉంటాయి.
కరోనా కారణంగా ఆర్థికంగా నష్టాల్లో ఉండడంతో వడ్డీరేట్లు తగ్గుతాయేమోనని ఆందోళన పడిన ప్రజలకు ఇది ఊరట కలిగించే విషయం. ఎందుకంటే స్థిరమైన రాబడి ఉంటుందనే ఉద్దేశంతో దేశంలో కోట్లాది మంది చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. భవిష్యత్ ప్రణాళికలను పక్కాగా వేసుకొని.. వడ్డీ రేట్లను బేరీజు వేసుకొని మదుపు చేస్తుంటారు. అలాగే ప్రస్తుత వడ్డీరేట్లను పరిశీలిస్తే.. ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టిన దాని కంటే చిన్న మొత్తాల పొదుపు పథకాలలోనే పెట్టుబడి పెట్టిన వారికి దాదాపు ఎక్కువ రాబడి వస్తుంది. అందుకే ఎక్కువ మంది చిన్న మొత్తాలను దాచుకునేందుకు ఈ పథకాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
0 Comments:
Post a Comment