Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 6 July 2021

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

 SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి....

SBI Apprentice Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్-2021 నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎస్‌బీఐ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత గల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 26, 2021గా ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో 6వేల 100 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.

అయితే ఏ రాష్ట్రానికి చెందినవారు ఆ రాష్ట్రంలోనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని స్పష్టంచేసింది ఎస్‌బీఐ.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పోస్ట్‌లకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 125పోస్ట్‌లు, ఆంధ్రాలో 100పోస్ట్‌లు ఖాళీగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎస్‌బీఐ. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమేనని, బ్యాంకులో ఉద్యోగం కాదని వెల్లడిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ వచ్చి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు:

ఆంధ్రప్రదేశ్(జిల్లాలవారీగా):
శ్రీకాకుళం -8, విజయనగరం -8, విశాఖపట్నం -7, తూర్పు గోదావరి -8, పశ్చిమ గోదావరి -8, కృష్ణా -7, గుంటూరు -7, ప్రకాశం -8, నెల్లూరు -8, చిత్తూరు -8, కడప -8, అనంతపూర్ -8, కర్నూలు -7

తెలంగాణ(జిల్లాలవారీగా):
ఆదిలాబాద్ -3, భద్రాద్రి కొత్తగూడెం -6, జగిత్యాల్ -2,జనగాం -3, జయశంకర్ భూపాలపల్లి-3, జోగులంబ గద్వాల -2, కామారెడ్డి -4, కరీంనగర్ -4, ఖమ్మం -7, కొమరంభీమ్ -2, మహాబూబాబాద్ -3, మహబూబ్‌నగర్ -9, మల్కాజ్‌గిరి -2, మంచిర్యాల్ -2, మెదక్ -4, నాగర్‌కర్నూల్ -4, నల్గొండ -6, నిర్మల్ -3, నిజామాబాద్ -11, పెద్దపల్లి -3, రంగారెడ్డి -6, సంగారెడ్డి -5, సిద్దిపేట -5, సిరిసిల్లా -2, సూర్యాపేట -7, వికారాబాద్ -6, వనపర్తి -3, వరంగల్ -1, వరంగల్ రూరల్ -3, యాదాద్రి భువనగిరి-4

ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియ (i) ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా.. మరియు (ii) స్థానిక భాష ఆధారంగా ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ పరీక్ష మినహా ప్రశ్నలు ద్విభాషా అంటే ఇంగ్లీష్ & హిందీ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కులు ఉంటాయి. ప్రశ్న కోసం కేటాయించిన మార్క్‌లో 1/4 వ భాగం తప్పు సమాధానానికి తీసివేయబడుతుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆగస్టు-2021లో జరుగుతుంది.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఏడాదిపాటు ట్రైనింగ్ పిరియడ్‌లో స్టైపెండ్- నెలకు రూ.15,000 ఉంటుంది. బెనిఫిట్స్, అలవెన్సులు ఉండవు.

పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, చీరాల, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top