గర్భాలయం చుట్టూ చేరిన కృష్ణమ్మ
కొత్తపల్లి, న్యూస్టుడే: జిల్లాలో చారిత్రక, ఆధ్యాత్మిక వైభవంతో వెలిగే క్షేత్రం సంగమేశ్వరం. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహరణి, భీమరథి, భవనాశి అనే సప్తనదులు కలిసే ప్రదేశం ఇది. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలుస్తాయి. ఇది మూడు పుష్కర నదులు కలిసే ప్రదేశం కావడంతో ఎంతో గుర్తింపు ఉంది.
17 అడుగులు పెరిగితే.. : సంగమేశ్వరంలో పురాతన గర్భాలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరి భక్తులకు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిస్తుంది.
గర్భాలయంలో భీమలింగం, సంగమేశ్వరుడు, శ్రీలలితాదేవి, వేపలింగం, వినాయకుడు దర్శనమిస్తారు. కొన్ని శతాబ్దాల క్రితం ప్రతిష్టించిన వేపలింగం ఏడాదిలో ఎనిమిది నెలలు నీటిలో మునిగినా, చెక్కు దెబ్బతినకపోవడం విశేషం. గర్భాలయం బయటపడి మొన్నటితో 15 సోమవారాలు పూర్తయ్యాయి. మార్చి 22న సోమవారం సంగమేశ్వరుడు తొలిపూజ అందుకున్నారు. మరో వారం రోజులు మాత్రమే భక్తులకు సంగమేశ్వరుని దర్శనం లభిస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం మంగళవారం సాయంత్రానికి 82 అడుగులకు చేరింది. ఇంక 17 అడుగుల నీటి మట్టం పెరిగితే గర్భాలయంలో నీరు చేరుతుందని పురోహితులు రఘురామశర్మ తెలిపారు. కృష్ణా నదితోపాటు తుంగభద్ర నదికి పెద్దఎత్తున వరదనీరు వస్తుండటం.. అడపాదడపా వర్షాలు పడుతుండటంతో ఆలయం మునిగిపోయే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు.
పూజలందుకున్న వేపదారు శివలింగం, దేవతామూర్తులు
0 Comments:
Post a Comment