Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 31 July 2021

Railway Jobs: రైల్వేలో 1664 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

 Railway Jobs: రైల్వేలో 1664 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. నార్త్ సెంట్రల్ రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1664 పోస్టుల్ని ప్రకటించింది. నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలో డివిజన్లు, వర్క్‌షాప్స్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు ఈ పోస్టులకు 2021 ఆగస్ట్ 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 1 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది నార్త్ సెంట్రల్ రైల్వే. ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrcpryj.org/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంటుంది.

అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

North Central Railways Recruitment 2021: భర్తీ చేసే పోస్టులు ఇవే...

ఫిట్టర్

వెల్డర్

ఆర్మేచర్ వైండర్

మెషినిస్ట్

కార్పెంటర్

ఎలక్ట్రీషియన్

పెయింటర్

మెకానిక్

ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్

వైర్‌మ్యాన్

ప్లంబర్

మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్

హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్

మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్

మెకానిక్ మెషీన్ టూల్స్ మెయింటనెన్స్

క్రేన్ ఆపరేటర్

డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)

స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)

స్టెనోగ్రాఫర్ (హిందీ)

North Central Railways Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు...

దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 2

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 1

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

వయస్సు- 2021 సెప్టెంబర్ 1 నాటికి 15 నుంచి 24 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు

ఎంపిక విధానం- ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

North Central Railways Recruitment 2021: అప్లై చేయండి ఇలా.....

అభ్యర్థులు ముందుగా నార్త్ సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వెబ్‌సైట్ https://www.rrcpryj.org/ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో అప్రెంటీస్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.

Apply online పైన క్లిక్ చేస్తే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.

అభ్యర్థుల పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.

ఆధార్ నెంబర్ లేనివాళ్లు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.

యాక్టీవ్‌లో ఉన్న మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత పోస్ట్ పేరు, డివిజన్ సెలెక్ట్ చేయాలి.

చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top