PDF to Word converter: PDF ఫైల్‌లను వర్డ్ ఫైల్‌గా ఆన్లైన్లో ఉచితంగా మార్చడం ఎలా??
కరోనా కారణంగా చాలా మంది ఒక సంవత్సరం నుండి ఇంటి వద్ద ఉండి వర్క్ చేస్తున్నారు. ఆఫీస్ వర్క్ చేస్తున్న సమయంలో అధికంగా PDF ఫైల్‌లను పొందుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో PDF ఫైల్లు సపోర్ట్ చేయవు. కావున PDF ఫైల్‌లను వర్డ్ ఫైల్‌గా ఎలా మార్చాలి అని ఆలోచిస్తున్నారా? మీ వద్ద పిడిఎఫ్ ఫైల్ ఉంటే కనుక అందులోని కొంత సమాచారాన్ని సవరించాలనుకుంటే కనుక మీరు దానిని వర్డ్ ఫైల్‌గా మార్చవలసి ఉంటుంది. ఇలా చేయడం చాలా సులభం. ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న కొన్ని కన్వర్టర్లను ప్రయత్నించి ఈ విధానాన్ని మరింత సులభంగా చేయవచ్చు.
ఆన్లైన్లో అనేక పిడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్ అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు ప్రయత్నించడానికి అందుబాటులో చాలానే ఉన్నాయి.
వీటిలో https://smallpdf.com/pdf-to-word, https://www.freepdfconvert.com/pdf-to-word, https://www.adobe.com/in/acrobat/online/pdf-to-word.html, https://simplypdf.com/ వంటివి ముఖ్యంగా ఉన్నాయి.
కన్వర్టర్ పిడిఎఫ్ టూ వర్డ్ ఛార్జ్ చేసే అనేక కన్వర్టర్ వెబ్సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పైన పేర్కొన్నవి ఆన్లైన్లో లభించే కొన్ని ఉచిత పిడిఎఫ్ - వర్డ్ కన్వర్టర్లుమాత్రమే. ఈ వెబ్సైట్లు చాలావరకు ఒకే పద్ధతిలో పనిచేస్తాయి. కొన్ని సాధారణ దశల్లో మీరు PDF ఫైల్‌ను వర్డ్ గా ఎలా మార్చవచ్చో వంటి వివరాలను తనిఖీ చేయడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.
PDF ని వర్డ్ ఫైల్‌గా మార్చే విధానం
స్టెప్ 1: పిడిఎఫ్ ఫైల్‌ను వర్డ్ గా మార్చడానికి ప్రయత్నించే అనేక ఉచిత వెబ్సైట్లలో ఎదో ఒకదానిని మొదట కనుగొనండి.
స్టెప్ 2: వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ఉదాహరణకు https://smallpdf.com/pdf-to-word వెబ్సైట్ ను ఓపెన్ చేయండి.
స్టెప్ 3: మీరు మార్చాలనుకుంటున్న PDF ఫైల్‌ను ఎంచుకోండి. ఇందులో మీరు మీ PC నుండి మీ యొక్క ఫైల్‌ను ఎంచుకోవచ్చు.
స్టెప్ 4: ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత కన్వర్ట్ ఎంపికపై క్లిక్ చేయండి.
స్టెప్ 5: కన్వర్ట్ చేయడం కోసం వెబ్సైట్ కు కొంత సమయం పడుతుంది కాబట్టి కన్వర్ట్ అయ్యే వరకు ఓపికపట్టండి. ఫైల్ మార్చబడే వరకు వేచి ఉండండి.
స్టెప్ 6: ఫైల్ మార్చబడిన తర్వాత వెబ్సైట్ మీకు తెలియజేస్తుంది.
స్టెప్ 7: తరువాత మీరు మార్చబడిన ఫైల్‌ను డౌన్లోడ్ చేసి సేవ్ చేయగలరు. కొన్ని వెబ్సైట్లు మార్చబడిన ఫైల్‌ను పంపడానికి ఇమెయిల్ ఐడిని అడుగుతాయి. మరికొన్ని నేరుగా వర్డ్ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిని ఇస్తాయి.
0 Comments:
Post a Comment