సెప్టెంబరు 12న నీట్
నేటి నుంచే ఆన్లైన్ దరఖాస్తులు
వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
🌻న్యూఢిల్లీ, జూలై 12: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్(యూజీ) పరీక్ష ను సెప్టెంబరు 12న నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించారు. విద్యార్థులు ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గత మార్చిలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వచ్చే ఆగస్టు 1న నీట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది.
కొవిడ్ నిబంఽధనలను పాటిస్తూ పరీక్ష నిర్వ హణకు అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్దే మాస్క్ అందిస్తామన్నారు. పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను 198కి పెంచుతామన్నారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను కూడా పెంచనున్నట్టు తెలిపారు. కాగా, నీట్(ఎండీఎస్) అడ్మిషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ధోరణిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. గత డిసెంబరులో పరీక్షలు నిర్వహించినా.. ఇంకా అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై వారం రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
0 Comments:
Post a Comment