Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 27 July 2021

Karnataka New CM: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై

 Karnataka New CM: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై

కర్ణాటక కొత్త సీఎం ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. బీజేపీ కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ రాష్ట్ర ప్రస్తుత హోంమంత్రి బసవరాజ్ బొమ్మై ఎన్నికయ్యారు. దీంతో ఆయన కర్ణాటక తదుపరి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ రోజు కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన బీజేపీ హైకమాండ్ ప్రతినిధులు, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి.. ఈ అంశంపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్న బసవరాజ్ బొమ్మను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కావాల్సిన పక్రియ దాదాపుగా పూర్తయ్యింది.

బసవరాజ్ బొమ్మై రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు.
ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. 1998,2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఎస్ఆర్ బొమ్మై అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడు. యడియూరప్ప సైతం తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైను ఎంపిక చేయాలని అధిష్టానానికి సూచించారనే ఊహాగానాలు వినిపించాయి. బసవరాజ్ బొమ్మై లింగాయత్ సామాజికవర్గానికి చెందడం ఆయనకు కలిసొచ్చిన అంశం.

 

బసవరాజ్ బొమ్మైను అభినందిస్తున్న యడియూరప్ప



నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసిన వెంటనే కొత్త ముఖ్యమంత్రి ఎవరవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అధిష్టానం మనసులో ఎవరున్నారు ? కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉంది ? అనే చర్చ మొదలైంది. మరోవైపు ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నాయకుడి సారథ్యంలోనే 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండటంతో.. ఆ నేత ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇందుకోసం బీజేపీ హైకమాండ్ ఎవరికి ఎంపిక చేస్తుందనే చర్చ జోరుగా సాగింది.

ధర్వాడ్ పశ్చిమ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్, విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ యత్నల్, కర్ణాటక మంత్రులు మురుగేశ్ నిరానీ, బసవరాజు బొమ్మాయ్, ప్రహ్లాద్ జోషి, బీఎల్ సంతోష్, సీఎన్ అశ్వనాథ్ నారాయణ్, లక్ష్మణ్ సవడి, గోవింద్ కర్జోల్, విశ్వేశ్వర హెగ్డే కగేరి, సీటీ రవి పేర్లను బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు ఊహాగానాలు వచ్చాయి.
ఒక దశలో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన సంతోష్‌ను సీఎం పదవికి బీజేపీ హైకమాండ్ ఎంపిక చేస్తుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ కర్ణాటకలో బలమైన సామాజికవర్గమైన లింగాయత్‌ వర్గానికి చెందిన నాయకుడికే బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు బసవరాజ్ బొమ్మై ఎంపికను బట్టి అర్థమవుతోంది.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top