JioFiber: 1000జీబీ డేటా కేవలం రూ. 199కే..!
టెలికాం రంగంలో జియో అనేక సంచలనాలను సృష్టించింది. తక్కువ ధరలకే ఇంటర్నెట్ డేటాను , ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని యూజర్ల కోసం జియో ప్రవేశపెట్టింది. జియో దెబ్బకు పలు మొబైల్ నెట్వర్క్ కంపెనీలు దిగివచ్చాయి. గత్యంతరం లేక పలు దిగ్గజ మొబైల్ నెట్‌వర్క్‌లు ఇంటర్నెట్ డేటా ధరలను తగ్గించాయి. ఉచిత కాల్స్‌ను కూడా ప్రవేశపెట్టాయి. 2019 సెప్టెంబర్‌లో జియోఫైబర్‌ను ప్రకటించి రిలయన్స్ మరో సంచలనాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పలు నగరాల్లో ప్రవేశపెట్టింది.
జియోఫైబర్‌తో పలు ఓటీటీ సేవలను, ఉచిత హెచ్డీ వాయిస్ కాల్స్, హై స్పీడ్ ఇంటర్నేట్, టీవీ వీడియో కాలింగ్, గేమింగ్, సెక్యూరిటీ సేవలను యూజర్లకు అందిస్తోంది.
జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో 999,1499,2499 డేటా ప్యాక్ లు ఎక్కువగా ప్రజాదరణను పొందాయి. తాజాగా జియో ఫైబర్ తన యూజర్ల కోసం అద్బుతమైన ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 199కే 1టీబీ డేటా(1000జీబీ)ను జియోఫైబర్ అందిస్తోంది.
యూజర్లకు ఈ డేటా సాచెట్ ట్యాక్స్‌తో కలిపి రూ.234.82రూపాయలకు రానుంది. కాగా డేటా ప్యాక్ వ్యాలిడిటీ కేవలం ఏడు రోజులు మాత్రమే. 1 టీబీ డేటా 100ఎమ్‌బీపీఎస్ స్పీడ్‌తో యూజర్లకు అందుబాటులో ఉండనుంది. డేటా ప్యాక్ ముగిసిన తరువాత 1ఎమ్‌బీపీఎస్ స్పీడ్ వస్తుంది.
ℕ𝕠 𝕠𝕟𝕖 𝕔𝕒𝕟 𝕦𝕤𝕖 𝕥𝕙𝕒𝕥 𝕞𝕦𝕔𝕙 𝕚𝕟𝕥𝕖𝕣𝕟𝕖𝕥 𝕡𝕖𝕣 𝕨𝕖𝕖𝕜
ReplyDelete𝔹𝕦𝕪𝕚𝕟𝕘 𝕥𝕙𝕚𝕤 𝕡𝕝𝕒𝕟 𝕚𝕤 𝕓𝕣𝕒𝕚𝕟 𝕝𝕖𝕤𝕤 𝕥𝕙𝕚𝕟𝕘