ఈనాడు, హైదరాబాద్: ఐఐటీల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను అక్టోబరు 3వ తేదీ(ఆదివారం) జరపనున్నట్లు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. తొలుత జులై 3న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. జేఈఈ మెయిన్ మూడు, నాలుగో విడత పరీక్షలు వాయిదాపడ్డాయి. మూడో విడత మంగళవారంతో.. నాలుగో విడత పరీక్షలు ఆగస్టు 26న మొదలై సెప్టెంబరు 2న ముగుస్తాయి. మెయిన్‌లో ప్రతిభ చూపిన రెండున్నర లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అవకాశం కల్పిస్తారు.
0 Comments:
Post a Comment