ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల ఇవే...!
కాలు, పిరుదు కండరాలు: ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాలు, పిరుదు కండరాలు శక్తి హీనంగా తయారవుతాయి. నడవడానికి, స్థిరంగా నిలబడడానికి ఉపయోగపడే ఈ పెద్ద కండరాలు బలహీనంగా తయారైతే.. వ్యాయామాల చేసినా.. కిందపడినా తీవ్రమైన గాయాలవుతాయి.
గుండె జబ్బులు, గుండెపోటుకు దారితీసే జీవక్రియ సమస్యలు: రోజులో ఎక్కువ సార్లు కండరాలను కదిలించడం వల్ల శరీరంలోని కొవ్వులు, చక్కెరలు సంపూర్ణంగా జీర్ణమవుతాయి. ఒకవేళ మనం రోజంతా కూర్చున్నట్లయితే, జీర్ణక్రియ వ్యవస్థ బలహీనపడి శరీరంలో కొవ్వులు, చక్కెరలు కరగక అలాగే స్టోర్ అవుతాయి.
క్యాన్సర్: గంటల కొద్దీ కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు, గర్భాశయం, పెద్దప్రేగు క్యాన్సర్లతో సహా మరికొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.జీవక్రియ సిండ్రోమ్: గంటలకొద్దీ కూర్చోవడం వల్ల తొడ కండరాలు కుచించుకుపోయి జాయింట్ పెయిన్ వస్తుంది.
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కఠినమైన ఎక్సర్సైజ్ చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. జీవక్రియ సిండ్రోమ్ వ్యాధి కూడా వస్తుంది.
రోజంతా యాక్టివ్ ఉండటం వల్ల పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు దరిచేరవు. కూర్చొని పనులు చేసేవారు 30 నిమిషాలకొకసారి నిల్చోని అటు ఇటు తిరగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. నిలబడి వర్క్ చేసినా.. ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. టీవీ చూస్తున్నప్పుడు లేదా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా నడవటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.
0 Comments:
Post a Comment