✍‘టెన్త్’ ఫలితాల ఫార్ములా రెడీ
♦ఎఫ్ఏ-1, 2లలో మార్కులే ప్రాతిపదిక
♦20 మార్కుల రాత పరీక్షలో పొందిన మార్కులకు 70% వెయిటేజి
♦30 మార్కుల వ్యక్తిగత నైపుణ్యాలలోపొందిన మార్కులకు 30%!
♦ఏ1, ఏ2, బీ1, బీ2, సీ1, సీ2, డీ1, డీ2 గ్రేడ్లు
♦ఈ-గ్రేడ్‌తో మిగిలిన వాళ్లూ పాస్
♦నేడు సర్కారుకు ఛాయారతన్ నివేదిక
🌻అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి):
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలకు సంబంధించిన ఫార్ములా సిద్ధమైంది. కరోనా కారణంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో.. ఇంటర్నల్ పరీక్షల మార్కుల మదింపు విధానం కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఎం.ఛాయారతన్ నేతృత్వంలో నియమించిన కమిటీ బుధవారం సమావేశమై దీనికి సంబంధించిన తుది ఫార్ములాను రూపొందించింది. కమిటీ తన నివేదికను గురువారం పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌కు సమర్పించనుంది. ఆ తర్వాత మార్కుల మదింపు ఫార్ములా, గ్రేడింగ్‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తారు. 2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన రెండు ఫార్మేటివ్ అసె్‌సమెంట్(ఎ్‌ఫఏ) పరీక్షల మార్కులను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఫార్ములాను తయారుచేశారు. ఎఫ్ఏ-1 పరీక్ష.. రాత పరీక్ష(స్లిప్ టెస్ట్) 20 మార్కులకు, విద్యార్థికి సంబంధించిన మూడు వ్యక్తిగత నైపుణ్యాలకు ఒక్కొక్క దానికి 10 మార్కుల చొప్పున 30 మార్కులకు కలిపి మొత్తంగా(20+30) 50 మార్కులకు నిర్వహించారు. దీని ఆధారంగా.. విద్యార్థి రాత పరీక్షలో 20 మార్కులకు సాధించిన మార్కులను 70ు గాను, మిగిలిన మూడు అంశాలలో కలిపి 30 మార్కులకు సాధించిన మార్కులను 30ు గాను పరిగణించాలని కమిటీ నిర్ణయించింది.
🌻ఈ 100 శాతాన్ని తిరిగి 50 మార్కులకు కుదించి నమోదు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఎఫ్ఏ-2 నుంచి కూడా 50 మార్కులకు లెక్కించనున్నారు. ఈ రెండు ఎఫ్ఏ(50+50) పరీక్షల్లో విద్యార్థికి వచ్చిన మార్కులతో గ్రేడింగ్‌లు ఇస్తూ తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. పదో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ పరీక్షల్లో సాధించిన మార్కులకు నిర్దేశించిన ఫార్ములా మేరకు ఏ1, ఏ2, బీ1, బీ2, సీ1, సీ2, డీ1, డీ2 గ్రేడ్లు ఇస్తారు. ఈ-గ్రేడ్‌తో మిగిలిన వాళ్లనూ పాస్ చేస్తారు. ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయరు. ఇదిలావుంటే.. ఎఫ్ఏ పరీక్షల్లో విద్యార్థులు అధిక మార్కులు పొందిన 3 సబ్జెక్టులను ప్రాతిపదికగా తీసుకుని వాటి సగటుతో గ్రేడ్లు ఇవ్వాలని గత సమావేశాల్లో కమిటీ అభిప్రాయపడినప్పటికీ.. అలా అయితే ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు 10/10 గ్రేడ్లు అధికంగా వస్తాయని భావించిన కమిటీ, చివరికి ఆ ఫార్ములాను పక్కనపెట్టింది. దీంతో ఈసారి 10/10 గ్రేడ్లు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని సమాచారం.
♦విద్యార్థులకు రెండు సర్టిఫికెట్లు
2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా విద్యార్థులకు మార్కులు, గ్రేడులు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేయనుంది. అప్పుడు విద్యార్థులకు 3 ఎఫ్‌ఏలు, ఒక సమ్మేటివ్ అసె్‌సమెంట్(ఎ్‌సఏ) పరీక్షను నిర్వహించారు. మూడు ఎఫ్ఏల సగటును 50 శాతానికి, ఒక ఎఫ్ఏను 50 శాతానికి మదింపు చేస్తారు. మొత్తం 100 శాతానికి గ్రేడింగ్‌ను నిర్ణయిస్తారు. ఇదిలావుంటే.. గత విద్యా సంవత్సరంలో టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా అందరినీ పాస్ చేశా రు. ఛాయారతన్ కమిటీ నిర్ణయించిన ఫార్ములా ప్రకా రం.. విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. అంటే, ప్రతి విద్యార్థికీ రెండు సర్టిఫికెట్లు ఇస్తారు. అవసరాన్ని బట్టి ఏ సర్టిఫికెట్ అయినా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
సాక్షి, అమరావతి:
టెన్త్' మార్కుల విధానం ఖరారు
త్వరలో ప్రభుత్వానికి హైపవర్ కమిటీ నివేదిక
ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఫలితాలు వెలువడే అవకాశం
టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ప్రకటించేందుకు మార్కుల విధానాన్ని హైపవర్ కమిటీ ఖరారు చేసింది. బుధవారం కమిటీ తుది సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఎస్సెస్సీ బోర్డు ఫలితాల విడుదలపై తుది కసరత్తు చేపట్టనుంది. ఆపై వారం పది రోజుల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలియజేశాయి.
అన్ని మార్కుల యావరేజ్‌తో గ్రేడ్లు
ఎస్సెస్సీ పరీక్షల్లో విద్యార్థులకు వారి ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల్లోని అన్ని సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకు ముందు ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ శాతం మార్కులు వచ్చిన(బెస్ట్ 3) సబ్జెక్టుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్లు ఇవ్వడంపై కమిటీ దృష్టి పెట్టింది. అయితే బెస్ట్ 3 ప్రకారం కాకుండా అన్ని సబ్జెక్టుల మార్కుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ ప్రకారం ఫలితాలివ్వాలని కమిటీ చర్చించింది. ఈ విధానంలోనే 2020-21, 2019-20 విద్యా సంవత్సరాల విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించనున్నారు.
► 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఫార్మేటివ్-1, ఫార్మేటివ్-2 మార్కులను తీసుకుని గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎఫ్ఏ(ఫార్మేటివ్ అసెస్మెంట్) పరీక్షలకు సంబంధించి లిఖిత పూర్వక పరీక్షలు, ఇతర పరీక్షలను విభజిస్తారు. ఎఫ్ఏ-1లోని లిఖిత పరీక్షకు సంబంధించిన 20 మార్కులను 70 శాతానికి పెంపుచేస్తారు. ఇతర 3 రకాల పరీక్షలకు సంబంధించిన 30 మార్కులను 30 శాతంగా పరిగణిస్తారు. ఉదాహరణకు 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒక విద్యార్థికి ఎఫ్ఏ-1 లిఖిత పూర్వక పరీక్షలో 20 మార్కులకు 18 మార్కులు వస్తే వాటిని 70 శాతానికి పెంపుచేసి 31.5 మార్కులుగా పరిగణిస్తారు. మిగతా మూడు విభాగాల్లో 30 మార్కులకు 27 మార్కులు సాధించి ఉంటే వాటిని 30 శాతానికి కుదింపుచేసి 13.5 మార్కులు వచ్చినట్టుగా పరిగణిస్తారు. మొత్తంగా ఎఫ్ఏ-1లో ఆ విద్యార్థికి 45 మార్కులు వచ్చినట్టుగా ప్రకటిస్తారు. అదే విధంగా ఎఫ్ఏ-2 మార్కులనూ విభజిస్తారు. ఎఫ్ఏ-2లో ఆ విద్యార్థికి 47 మార్కులొస్తే కనుక ఆ రెంటినీ కలిపి 100 మార్కులకు 92 మార్కులు సాధించినట్టుగా.. గ్రేడును నిర్ణయిస్తారు.
► 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకూ గ్రేడ్లపై కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఫార్మేటివ్ అసెస్మెంటు(ఎఫ్ఏ) పరీక్షలు 3, సమ్మేటివ్ అసెస్మెంటు (ఎస్ఏ) పరీక్ష ఒకటి రాసి ఉన్నారు. ఫార్మేటివ్ 1, 2, 3ల మార్కులను 50గా తీసుకుంటారు. సమ్మేటివ్ పరీక్షలు 100 మార్కులకు నిర్వహించినందున వాటిని యావరేజ్ చేసి 50గా తీసుకుంటారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను రెండింటినీ కలిపి 100 శాతానికి యావరేజ్ చేసి గ్రేడ్లు ఇవ్వనున్నారు.
0 Comments:
Post a Comment