దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. డీఏను పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 17 శాతంగా ఉన్న డీఏను 28 శాతానికి పెంచేందుకు ఆమోదం తెలిపింది. జులై 1 నుంచి ఈ పెంపుదల వర్తించనుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. త్వరలో పశువుల కోసం అంబులెన్సులు తీసుకురానున్నట్లు చెప్పారు. ఆయుష్ మిషన్ కార్యకలాపాలను 2026 వరకు పొడిగిస్తున్నామని, ఆయుష్ మిషన్‌కు రూ.4,607 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
పెంచిన ఈ డీఏను 2021 ఏడాది మొదటి నెల నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక పెంచిన ఈ డీఏ కారణంగా సుమారు 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ఇది ఇలా ఉండగా… 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.
మరో వైపు 2021 జులై నుంచి కొత్త డీఏను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ సారి డీఏ పెంచేందుకే నిర్ణయం తీసుకుంది. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి డీఆర్ పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు కేంద్రం.
0 Comments:
Post a Comment