online classes from 15 - School Education Commissioner Revealed
15 నుంచి ఆన్లైన్ తరగతులు - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడి
🌻పెడన, న్యూస్టుడే:* ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈనెల 15 నుంచి ఆన్లైన్ తరగతులను ప్రారంభిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనరు వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు వెట్రిసెల్వితో కలిసి ఆదివారం కృష్ణా జిల్లా పెడనలో ఆయన పర్యటించారు. స్థానిక రెండో వార్డులో ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి చేసిన పాఠశాలను పరిశీలించారు. అనంతరం కమిషనరు మాట్లాడుతూ.. ఈనెల ఒకటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు 50 శాతం హాజరవుతూ బడుల పునఃప్రారంభానికి సిద్ధం చేస్తున్నారని, విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. దూరదర్శన్, రేడియా, విద్యా వారధి ద్వారా ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాలలకు విద్యార్థుల్ని ఎప్పటి నుంచి అనుమతించాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
0 Comments:
Post a Comment