విద్యా శాఖలో కాలం చెల్లిన పోస్టుల రద్దు
కసరత్తు ప్రారంభించిన అధికారులు
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విద్యా శాఖలో కాలం చెల్లించిన పోస్టులను రద్దు చేయాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇలాంటి పోస్టులు ఎన్ని ఉంటాయన్న అంశంపై కసరత్తును ప్రారంభించారు. 40 సంవత్సరాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా పలు పోస్టులను అప్పటి ప్రభుత్వాలు మంజూరు చేశాయి. అయితే ఇప్పటి పరిస్థితులకు ఈ పోస్టుల అవసరం ఉండడం లేదు. ముఖ్యంగా కుట్టుమిషన్ టీచర్, తోటమాలి వంటి పలు పోస్టులు గతంలో విద్యా శాఖ పరిధిలో ఉండేవి. ఈ పోస్టులన్నీ ఆయా పాఠశాలల పరిధిలో ఉండేవి. ప్రస్తుతం ఇలాంటి పోస్టుల్లో ఉద్యోగులు ఎవరూ లేరు. దాంతో ఈ పోస్టులను రద్దు చేసి, అవసరమైన ఇతర పోస్టులను మంజూరు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
0 Comments:
Post a Comment