5 investment lessons to learn from Warren Buffett
వారెన్ బఫెట్ నుంచి నేర్చుకోవాల్సిన 5 పెట్టుబడి పాఠాలు
మీకు అవగాహన లేని వ్యాపారంలో పెట్టుబడి పెట్టొద్దు:
వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్స్‌లో ఇదొకటి. అంటే అర్థమైన, అవగాహన ఉన్న వ్యాపారాల్లోనే పెట్టుబడులు పెట్టాలని బఫెట్ సూచిస్తాడు. అతడు నమ్మిన రంగాల్లోనే పెట్టుబడులు పెడతాడు. వ్యాపారంలో లేదా మార్కెట్లలో ఆర్థిక అనిశ్ఛితి ఎదురైనప్పుడు మీరు నమ్మినదానినే పాటించండి. పెట్టుబడులు పెట్టేముందు దానికి తగిన పరిశోధన చేయడం చాలా ముఖ్యం, ఇది హేతుబద్దంగా ఉండాలి. మీరు ఇల్లు ఎంత ఇష్టపడి కొంటారో స్టాక్‌ను కూడా అంత ఇష్టపడి, అర్థం చేసుకొని కొనుగోలు చేయాలి. మార్కెట్ లేనప్పుడు మీరు స్టాక్‌ను మీ వద్దే కొనసాగించాల్సి వచ్చినప్పటికీ ఎటువంటి బాధ కలగకూడదు.
అటువంటి స్టాక్‌పై వెచ్చించాలి.
పెట్టుబడులు చేయకపోతే తప్పు చేస్తున్నట్లే:
డబ్బును నగదు రూపంలో పొదుపు చేయడం చాలా తప్పు అని భావిస్తారు బఫెట్. లిక్విడిటీ ఎక్కువగా ఉండకూడదు. ఉన్నదానితో మరింత సంపాధించేవిధంగా పెట్టుబడుదారుల ఆలోచనలు కొనసాగాలి. ఇప్పుడు ఎక్కువ డబ్బు కలిగిన వ్యక్తులు సంతోషంగా ఉంటారు, కానీ అలా ఉండకూడదు. అలా ఉంటే సమయం గడిచిన కొద్దీ ఆ డబ్బుపై పొందే లాభం ఏం ఉండకపోగా, అది తరిగిపోతుంది.
దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాలి:
మనం ఇప్పుడు ఒక చెట్టు నీడన కూర్చుంటున్నాం అంటే ఎవరో ఒకరు గతంలో ఆ చెట్టును నాటారు కదా. అదేవిధంగా దీర్ఘకాలిక ప్రణాళికలు చాలా ముఖ్యం. అయితే బఫెట్ నియమం ఎంటంటే మీరు కొనుగోలు చేసే స్టాక్, 10 సంవత్సరాలు మార్కెట్ పనిచేయపోయినా మీరు సంతోషంగా ఉండగలగాలి. ఎందుకంటే మీరు పెట్టుబడిన పెట్టిన వ్యాపారం ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఎటువంటి మార్పులైనా రావొచ్చు
మీకోసం మీరు పెట్టుబడి చేసుకోండి:
వారెన్ బఫెట్ నుంచి నేర్చుకోవాల్సిన అతిముఖ్యమైన పాఠం, మీపై మీరు పెట్టుబడులు పెట్టడం, అతడు 90 సంవత్సరాల వయసులో కూడా ఇంకా నేర్చుకుంటున్నాడు, వ్యక్తిగత వృద్ధికి సమయం కేటాయించడం అవసరం అని చెప్తాడు. రోజు చాలాసమయం నాతో నేడు గడుపుతాను, ఆలోచిస్తాను. ఇది ఎక్కువమంది చేయరు కాబట్టి నష్టపోతుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. నేను అలాంటివి చేయను అని చెప్తారు.
క్రెడిట్ కార్డు రుణాలు:
మిలీనియల్స్ క్రెడిట్ కార్డులను పిగ్గీ బ్యాంకులుగా ఉపయోగించడాన్ని మానేయాలని బఫెట్ సూచించారు. క్రెడిట్ కార్డుల రుణాలకు 18 శాతానికి పైగా చెల్లిస్తారు. పెట్టుబడులపై వచ్చే రాబడి అంత మొత్తంగా లేనప్పుడు అంత చెల్లించకూడదని అని ఆయన అభిప్రాయం.
18 శాతం రాబడి ఎలావస్తుందో నాకు తెలియదు. నేను 18 శాతం వడ్డీతో డబ్బు చెల్లించాల్సి ఉంటే, నా దగ్గర ఉన్న ఇతర ఆస్తులతో నేను మొదట క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లిస్తాను. నాకు వచ్చిన ఇతర పెట్టుబడి ఆలోచన కంటే ఇది మంచి మార్గం అని బఫెట్ అంటారు.
జీవితం మొత్తం ఇంత ఎక్కువగా వడ్డీ చెల్లిస్తూ సంతోషంగా గడపలేరు. అందుకే నేను అందరికి చెప్పేదేంటంటే 12 శాతం వడ్డీ కూడా ఎవరికి చెల్లించవద్దు. ఒకవేళ అంత ఎక్కువ వడ్డీ రుణాలు ఉంటే ముందు వాటిని చెల్లించండి, తర్వాత పెట్టుబడుల గురించి ఆలోచించండి అని చెప్తారు బఫెట్.
0 Comments:
Post a Comment