దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కోవిషీల్డ్(Covshield), కోవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలను వేస్తున్నారు. అయితే చాలా మంది ప్రజలు కోవిషీల్డ్ టీకాను తీసుకుంటున్నారు. ఇక దేశంలో మూడో వేవ్ వస్తుందని చెబుతున్న నేపథ్యంలో మరోమారు కోవిషీల్డ్ టీకాలపై ఓ వార్త చర్చకు వచ్చింది. అదేమిటంటే.. చాలా మంది కోవిషీల్డ్ తీసుకున్నప్పటికీ కోవిడ్ బారిన పడుతున్నారు. దీంతో వారిలో యాంటీ బాడీలు తగ్గిపోతున్నాయి. కనుక అలాంటి వారికి మూడో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ అభిప్రాయ పడింది.
దేశంలో కోవిడ్ మూడో వేవ్ డెల్టా వేరియెంట్ వల్లే వస్తుందని చెబుతున్నారు. అయితే కోవిడ్ టీకాలను తీసుకోవడం వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలు డెల్టా స్ట్రెయిన్‌ను వేగంగా బలహీనపరుస్తున్నాయి.
కానీ కోవిషీల్డ్ తీసుకున్న తరువాత కొందరికి డెల్టా వేరియెంట్ వ్యాప్తి చెందుతోంది. దీంతో యాంటీ బాడీలు తగ్గిపోతున్నాయి. కనుక వారికి మూడో డోసు ఇవ్వాల్సి అవసరం ఉంది.. అని ఐసీఎంఆర్ తెలిపింది.
కాగా కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న తరువాత ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలను డెల్టా వేరియెంట్ నాలుగున్నర రెట్లు ఎక్కువగా తగ్గిస్తుంది. కోవిషీల్డ్ రెండో డోసు తీసుకున్న తరువాత ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలను ఆ వేరియెంట్ 3.2 రెట్లు ఎక్కువ వేగంగా తగ్గిస్తుంది. దీని వల్లే కోవిషీల్డ్ రెండు డోసులను తీసుకున్న వారికి మూడో డోసు వేయాల్సిన అవసరం ఏర్పడిందని ఐసీఎంఆర్ ఎపిడెమియాలజీ అండ్ ఇన్ఫెక్షన్ హెడ్ డాక్టర్ సమీరన్ పాండా అన్నారు. దీని వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే కోవిషీల్డ్ రెండు డోసులను తీసుకున్న వారికి మూడో డోసు వేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఇతర వ్యాక్సిన్ల గురించి ఈ విధంగా ఐసీఎంఆర్ ఏమీ చెప్పలేదు.
Iam Cps tetire employee iam not getting old age also please I request to.issue minimum pension for my livelyhood
ReplyDelete