✍ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం ఉచిత సీట్లు* *అమలు చేయాలి
♦హైకోర్టులో పిటిషన్.. వచ్చేనెల 9న విచారణ
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్ అమలు చేయటంలేదని దీనివల్ల వేలాదిమంది నష్టపోతున్నారంటూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురువారం ధర్మాసనం ముందుకు వచ్చింది. యోగేశ్ 2017లో ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయ మూ ర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సంద ర్భంగా యోగేశ్ స్వయంగా వాదనలు వినిపిస్తూ 25 శాతం సీట్ల కేటాయింపుపై చట్ట నిబంధనలు ఉన్నప్పటికీ అమలు కావటంలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. విద్యా సంవత్సరం పున ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఆగస్టు 9న విచారణ జరిపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
0 Comments:
Post a Comment