20 days leave for corona positive employees
కరోనా పాజిటివ్ ఉద్యోగులకు 20 రోజుల సెలవులు
కరోనా పాజిటివ్ ఉద్యోగులకు Hospitalization / Quarantine పీరియడ్ క్రమబద్ధీకరణకు మంజూరు చేయవలసిన సెలవులుపై ఉత్తర్వులు G.O.MS.No. 45 Dated: 05-07-2021 విడుదల.
Regularization of AP Employees hospitalization / quarantine period during COVID-19 Pandemic - Sanction w.e.f. 25-03-2020 - Orders G.O.MS.No. 45 Dated: 05-07-2021
ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ కరోనా పాజిటివ్ వస్తే 28 రోజులు స్పెషల్ క్యాజువల్ సెలవులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ,విజయవాడ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని,
కరోనా పాజిటివ్ ఉద్యోగులకు 15 రోజులు ప్రత్యేక సాధారణ సెలవులు మరియు 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు మొత్తం 20 రోజుల సెలవులు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేయదానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించారు.ఆ ఫైలుపై ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరికి కరోనా వచ్చినా 20 రోజుల సెలవులు మజూరు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు యధాతథంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.
కరోనా పాజిటివ్ ఉద్యోగులకు 20 రోజుల సెలవులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్..విజయవాడ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది.
ఏపీన్జీవోస్ అసోసియేషన్.. విజయవాడ..
0 Comments:
Post a Comment