భారత సైన్యంలో చేరాలనుకునే వారికి సువర్ణావకాశం. నాన్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ పోస్టుల కోసం భారత టెరిటోరియల్ ఆర్మీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు నేటి ( జూలై 20 ) నుంచి ఆగస్టు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు లెఫ్టినెంట్ హోదా కల్పించనున్నారు. సాధారణ ఆర్మీ అధికారులకు ఉన్నట్టుగా వీరికి కూడా అవే అధికారాలు, శాలరీ, అలవెన్సులు అందిస్తారు. ఏడాదిలో రెండు నెలల తప్పనిసరి శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.56,100 నుంచి 1,77,500 వరకు శాలరీ ఇవ్వనున్నారు.
అర్హతలు
ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఆగస్టు 19, 2001 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే 42 ఏండ్లలోపు వారు అయి ఉండాలి.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
ముందుగా భారత టెరిటోరియల్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోం పేజిలోని ఆర్మీ రిక్రూట్మెంట్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఇతర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ చేసుకున్నాక ఒక రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. వాటి ఆధారంగా దరఖాస్తు నింపాలి.
ఫొటో, సంతకం స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు కోసం రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవడం మరిచిపోవద్దు.
ఎంపిక విధానం
రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. రాత పరీక్ష రెండు భాగాలుగా ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. మొదటి పేపర్లో రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ ఉంటాయి. ఇక రెండో పేపర్లో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఉంటాయి. మొత్తం రెండు వందల మార్కులకు ఈ పేపర్ ఉంటుంది. ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఇస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై అవ్వాలంటే కనీసం 40 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment