Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 12 June 2021

Telangana New Pay Scales- పీఆర్సీ.. కనీస వేతనం ₹19వేలు

  Telangana New Pay Scales-     పీఆర్సీ.. కనీస వేతనం ₹19వేలు


హైదరాబాద్: తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్‌సీ అమలు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,21,037 ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది, పింఛన్‌దారులందరికీ 30 శాతం ఫిట్‌మెంట్‌ అమలు కానుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలకు పెరగనుంది. 2018 జులై 1 నాటికి ఉన్న డీఏ 30.392 శాతం మూల వేతనంలో కలుస్తుంది. మొత్తం 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయనుండగా.. అందుకు అనుగుణంగా ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్లను ప్రభుత్వం సవరించింది. జూన్‌ నెల నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి. ఏప్రిల్‌, మే నెల బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

2018 జులై 1 నుంచి నోషనల్‌ బెనిఫిట్‌, 2020 ఏప్రిల్‌ 1 నుంచి మానిటరీ బెనిఫిట్‌, 2021 ఏప్రిల్‌ 21 నుంచి క్యాష్‌ బెనిఫిట్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో హెచ్‌ఆర్‌ఏ 24 శాతానికి తగ్గనుంది. కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, రామగుండం, వరంగల్‌లో 17 శాతం; 50వేల నుంచి 2 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో 13 శాతం; ఇతర ప్రాంతాల్లో 11 శాతం అమలు కానుంది. పింఛనర్లకు 36 వాయిదాల్లో బకాయిలు చెల్లించనున్నారు. 2018 జులై తర్వాత పదవీ విరణమ చేసినా 2020 పీఆర్‌సీ ప్రకారమే పింఛన్‌ను అందించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కనీస పింఛన్‌ రూ.6,500 నుంచి రూ.9,500 వరకు పెరగనుంది. రిటైర్‌మెంట్‌ గరిష్ఠ గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. పింఛన్‌దారుడు, కుంటుంబీకులకు మెడికల్‌ అలవెన్స్‌ నెలకు రూ.600 పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులు, పింఛనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా పది ఉత్తర్వులు జారీ చేసింది.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top