Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 7 June 2021

Rationalisation 3,750 బడుల మూత! పాఠశాలల హేతుబద్ధీకరణకు విద్యాశాఖ యోచన

 3,750 బడుల మూత!

పాఠశాలల హేతుబద్ధీకరణకు విద్యాశాఖ యోచన

- విద్యార్థులు తక్కువున్న స్కూళ్ల విలీనం

- నేడు విద్యామంత్రి కీలక సమావేశం


రాష్ట్రంలో పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టేందుకు విద్యాశాఖ సమాలోచన చేస్తున్నది. ఇప్పటికే అధికారులు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. విద్యార్థుల్లేని, తక్కువ మంది పిల్లలున్న ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ పాఠశాలలను పక్కనున్న స్కూళ్లలో విలీనం చేయాలని భావిస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 3,750 బడులు మూతపడే అవకాశమున్నది. ఇందులో సున్నా ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్న పాఠశాలలూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.



ఉన్నత పాఠశాలలు 10, ప్రాథమికోన్నత పాఠశాలలు 7, ప్రాథమిక పాఠశాలలు 1,175 చొప్పున మొత్తం 1,292 స్కూళ్లు విద్యార్థుల్లేనివి ఉన్నాయి. అయితే ఉన్నత పాఠశాలల్లో 75 మందిలోపు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మందిలోపు, ప్రాథమిక పాఠశాలల్లో 10 మందిలోపు ఉన్న స్కూళ్లను మూసివేయాలని అధికారులు నివేదిక రూపొందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో 75 మందిలోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు (పంచాయతీరాజ్‌-998, ప్రభుత్వ-33) 1,031 ఉంటే, 20 మందిలోపు ప్రాథమికోన్నత పాఠశాలలు 165, పది మందిలోపు ప్రాథమిక పాఠశాలలు 2,554 ఉన్నాయి. ఆ పాఠశాలలను పక్కనుండే ఇతర స్కూళ్లలో విలీనం చేయాలని భావిస్తున్నారు. 75 మందిలోపు 998 జెడ్పీహెచ్‌ఎస్‌లలో 51,129 మంది విద్యార్థులు చదువుతున్నారు. 8,273 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక 75 మందిలోపు విద్యార్థులున్న 33 ప్రభుత్వ పాఠశాలల్లో 1,792 మంది విద్యార్థులు, 349 మంది టీచర్లున్నారు. 20 మందిలోపు విద్యార్థులున్న 165 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2,351 మంది పిల్లలు, 681 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక పది మందిలోపు విద్యార్థులున్న 2,554 ప్రాథమిక పాఠశాలల్లో 9,812 మంది పిల్లలు చదువుతుండగా, 3,623 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వందమందిలోపు విద్యార్థులున్న స్కూళ్లను ప్రాతిపదిక గా తీసుకుంటే 1,585 ఉన్నత పాఠశాలలు మూతపడే అవకాశము న్నది. 30 మందిలోపు పిల్లలను ప్రాతిపదికన 429 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇక గంట మోగే అవకాశం లేదు. 20 మందిలోపు విద్యార్థులను ప్రాతిపదికన భావిస్తే 5,851 ప్రాథమిక పాఠశాలలదీ అదే పరిస్థితి. విద్యార్థులు 75 మందిలోపు ఉన్నత పాఠశాలలు, 30 మందిలోపు ప్రాథమికోన్నత పాఠశాలలు, 20 మందిలోపు ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసే స్కూళ్ల సంఖ్య 7,788 ఉండనుంది. ఇక ఒకే ప్రాంగణంలో ఉన్న పాఠశాలలనూ విలీనం చేయాలని విద్యాశాఖ గతంలోనే కసరత్తు చేసింది. అలాంటి పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా 7,077 ఉన్నాయి. ఈ నిర్ణయం అమలైతే పాఠశాలల సంఖ్య తగ్గ నుంది. విద్యారంగ సమస్యలు, కరోనా తీవ్రత, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ చదు వులు, విద్యాసంస్థల పున:ప్రారంభం, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలు వంటి అనేక అంశాలపై విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సోమవారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది. మిగిలిన అంశాలను మంత్రివర్గం, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లి ఆమోదం వచ్చాక అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో పరిశీలించాకే

పాఠశాలల హేతు బద్ధీకరణ చేయాల నుకుంటే బడి అవసరమా? లేదా?, విద్యార్థులు న్నారా? లేదా? అనే విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. పిల్లలున్నారా?, ఉంటే బడిలో ఎందుకు చేరడం లేదు అన్న సమస్యలను తెలుసుకోవాలి. లోపాలుంటే వాటిని సరిదిద్ది విద్యార్థులు చేరేటట్టు చర్యలు తీసుకోవాలి. అక్కడ విద్యార్థులే లేకుంటే వాటిని విలీనం చేయడం మంచిదే. క్షేత్రస్థాయిలో పరిశీలించి పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ని సంప్రదించి హేతుబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలి.

- చావ రవి, టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top