Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Wednesday, 2 June 2021

New Education Policy - పాఠశాల విద్యలో పెనుమార్పులు కేంద్ర విధానం.. రాష్ట్రం హడావిడి ఈ ఏడాది నుండే అమలు ? మూడవ తరగతి చదువు కోసం కిలోమీటర్ల కొద్దీ నడక భారం చిన్నారులపై పడుతుంది. క్షేత్రస్థాయిలో భారీ మార్పులకు, భావి తరాలపై పెను ప్రభావానికి దారితీసే ఇంత కీలకమైన ఉత్తర్వులను నామమాత్రపు చర్చ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా జారీ... ప్రజాశక్తి స్పెషల్ ఆర్టికల్..

 పాఠశాల విద్యలో పెనుమార్పులు

కేంద్ర విధానం.. రాష్ట్రం హడావిడి

ఈ ఏడాది నుండే అమలు ?

ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురైన నూతన విద్యావిధాన బాటలోనే కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. అది కూడా కరోనా రక్కసి విరుచుకుపడుతూ భారీ సంఖ్యలో ప్రజల ప్రాణాలను కబళిస్తున్న వేళ... పిల్లల క్షేమం కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్న వేళ! గత ఏడాది కరోనా తొలి విడత విజృంభణ సమయంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఇప్పుడున్న విద్యావ్యవస్థ సమూల మార్పులకు గురవుతుంది. పాఠశాలలు, హైస్కూళ్లు, జూనియర్‌ కళాశాలలపైన ప్రభావం పడుతుంది.

అంగన్‌వాడీ సెంటర్లు మాయమవుతాయి. అంగన్‌వాడీలు ఉపాధ్యాయులుగా మారక తప్పనిస్థితి ఏర్పడుతుంది. మూడవ తరగతి చదువు కోసం కిలోమీటర్ల కొద్దీ నడక భారం చిన్నారులపై పడుతుంది. క్షేత్రస్థాయిలో భారీ మార్పులకు, భావి తరాలపై పెను ప్రభావానికి దారితీసే ఇంత కీలకమైన ఉత్తర్వులను నామమాత్రపు చర్చ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా జారీ చేయడం ఎందుకోసమో.. ఎవరి మెప్పు కోసమో!

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని రాష్ట్రప్రభుత్వం అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏప్రిల్‌లో కేంద్రం ఇచ్చిన తాజా మార్గదర్శకాలను ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేసేందుకు సన్నాహాలు జరుపుతోంది. దీన్ని పర్యవసానాన్ని స్త్రీ శిశు సంక్షేమ, పాఠశాల విద్యాశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఎలాంటి భారం పడుతుందో వేచి చూడాలి. పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలో ఇక నుంచి 5+3+4+4 విధానం అమలవుతుందని సోమవారం సర్య్కూలర్‌ విడుదల చేసింది. ఎర్లీచైల్డ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో పాఠశాల విద్యలో మార్పులను ప్రతిపాదిస్తూ కేంద్రం ఏప్రిల్‌ 8న మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలు తమకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చునని పేర్కొంది. అందులో వెంటనే అమలు చేయాలని పేర్కొనపోయినా రాష్ట్రప్రభుత్వం అతి ఉత్సాహంగా ఈ ఏడాది నుండే అమలంటూ హడావుడిగా సర్క్కూలర్‌ జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వం అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద పథకాలను ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ పథకా లను నూతన విద్యావిధానంలో భాగంగానే చేపట్టి న్నట్లు సర్క్యూలర్‌లో ప్రస్తావించారు. దీని ప్రకారం ప్రస్తుతమున్న బదడుల స్థానంలో ప్రీప్రైమరీ, ఫౌండేషన్‌, సెకండరీ పాఠశాలలు ఉంటాయి.

వైఎస్‌ఆర్‌ ప్రీప్రైమరీ పాఠశాలలు, ఫౌండేషన్‌ పాఠశాలలు

ప్రస్తుతం ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు పిపి1, పిపి2లుగా వైఎస్‌ఆర్‌ ప్రీప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ప్రీపరేటరీ 1వ తరగతి, 1,2వ తరగతులు ఉంటాయి. వీలైనంతవరకు పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేస్తారు.ఈ పాఠశాలల్లో 1,2 తరగతులను ఒక ఎస్జిటి చూసుకుంటారు. మిగిలిన ఉపాధ్యాయులను ఎలా నియమిస్తారన్నది సర్క్యులర్‌లో పేర్కొనలేదు.


ఉన్నత పాఠశాలలు

ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లలు, బోధించే ఉపాధ్యాయులు సమీప ప్రాథమికోన్నత గానీ, ఉన్నత పాఠశాలకు గానీ వెళ్తారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలకు 3కిలోమీటర్ల దూరంలో అప్పర్‌ ప్రైమరీ, లేదాహైస్కూలును గుర్తిస్తారు. ప్రాథమిక పాఠశాలల నుంచి అదనపు విద్యార్ధులను తీసుకునేందుకు యుపి స్కూల్స్‌, హైస్కూల్స్‌ సామార్ధ్యాన్ని తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న వసతి సరిపోకపోతే, 3 నుంచి 5వ తరగతి వరకు నిర్వహణ కోసం అదనపు తరగతి గదులను నాడు-నేడు మంజూరు చేస్తారు.ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలలు విద్యార్ధులు చేరిన తరువాత సంఖ్య 150 దాటితే దానిని హైస్కూల్‌గా ప్రకటిస్తారు. సెకండరీ పాఠశాలలు 5కిమీ సమీపంలో సమాంతరం మాధ్యమంతో పనిచేస్తుంటే ప్రత్యేక మాధ్యమంలో నమోదు ఆధారంగా ప్రత్యేకంగా ఇంగ్లీష్‌, తెలుగు మీడియం కోసం ప్రతిపాదించవచ్చు.

జూనియర్‌ కళాశాలలు

మాధ్యమిక పాఠశాలల్లో విద్యార్ధులు సంఖ్య ఎక్కువగా ఉన్న వాటిని మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున 11,12 తరగతులు నిర్వహిస్తారు. ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాల విద్యార్ధులకు దగ్గరలో ఉండాలి. 1కిలో మీటర్ల వ్యాసార్ధంలో ఫౌండేషన్‌ పాఠశాల, నివాసం నుంచి 3కిలోమీటర్లలో దూరంలో మాధ్యమిక పాఠశాల ఉండాలి. ప్రైమరీలో ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తి 1:35, ప్రాథమికోన్నతలో 1:35, ఉన్నత పాఠశాలల్లో 1:40గా ఉండాలి.

ఈ విద్యాసంవత్సరంలోనే అమలు సాధ్యపడేనా ?

నూతన విద్యావిధానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇందుకు సంబంధించిన పెద్దఎత్తున సన్నాహాలు చేయాలి. ఈ ఎన్‌ఇపిపై అందరీ స్టేక్‌ హోల్డర్స్‌తో చర్చలు జరుపుతామంటూనే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెల, రెండు నెలల్లో నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ తక్కువ సమయంలో చర్చించి అందరీ ఆమోద్యం తీసుకుంటుందా? లేదా తూతూ మంత్రంగా సంప్రదింపులను చేసి ప్రభుత్వం తన నిర్ణయాన్ని బలవంతంగా రుద్దుతుందో చూడాలి. ప్రాథమికోన్నత నుంచి ఉన్నత పాఠశాలలుగా మార్చడం, అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 11,12 తరగతులు ప్రవేశపెట్టడం సాధ్యపడుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగలనుంది. అదేవిధంగా ఈ విధానం వల్ల పెద్ద ఎత్తున పిల్లలు డ్రాపవుట్లుగా చదువుమానుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో 3కిలో మీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల లేదు. ఈ సమస్య గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏళ్లతరబడి వేధిస్తోంది. ఇప్పుడు హడావుడిగా చేసే మార్పులు ఫలిస్తాయా?. 3 నుంచి 12వ తరగతి పాఠశాలలకు టీచర్లు,బోధనేతర సిబ్బంది వంటి ఇతర మౌలిక వసతులు అంశాలు గురించి ప్రస్తావించలేదు. అంగన్‌వాడీ టీచర్లు శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి, ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వస్తారు. ఇప్పుడు ఇద్దరు ఒకే వ్యవస్థలోకి వచ్చినప్పుడు వీరి సర్వీసు నిబంధనలు, పర్యవేక్షణ ఎవరి పరిధిలో జరుగుతాయన్నది స్పష్టత లేదు. అంగన్‌వాడీలను ప్రభుత్వం అనేక ఇతర పనులకు ప్రస్తుతం ఉపయోగిస్తోంది. వీటిని ఈ పాఠశాలల పని తోడు అదనపు భారం అవబోతున్నదా అన్నది చూడాలి.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top