లక్ష్మణఫలం.. బరువు ఘనం
లక్ష్మణఫలాన్ని చూపుతున్న నర్సరీ నిర్వాహకుడు
కడియం మండలం బుర్రిలంకలోని గట్టి పవన్ నర్సరీలో లక్ష్మణఫలం చెట్టుకు కాయలు కాశాయి. అందులో ఒకటి 750 గ్రాముల బరువుంది. ఉద్యానశాఖాధికారి సుధీర్‌ను వివరణ కోరగా సాధారణంగా ఈ ఫలం 500 గ్రాముల వరకు బరువుంటుందని, నేల స్వభాన్ని బట్టి అరుదుగా ఇలా పెద్దకాయలు కాస్తుంటాయన్నారు. వీటిలో ఔషధ గుణాలుండటంతో క్యాన్సర్, మధుమేహ రోగులు ఎక్కువగా తింటారని, దీని శాస్త్రీయనామం 'ఆనోనా మ్యూరికాటా' అని కాకినాడలోని పీఆర్ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకురాలు పాలపర్తి షారా తెలిపారు. -ఈనాడు, రాజమహేంద్రవరం
0 Comments:
Post a Comment